బాలీవుడ్‌లో కలకలం : సల్మాన్ ఖాన్, అతని తండ్రికి బెదిరింపు లేఖ .. రంగంలోకి పోలీసులు

Siva Kodati |  
Published : Jun 05, 2022, 07:42 PM ISTUpdated : Jun 05, 2022, 07:53 PM IST
బాలీవుడ్‌లో కలకలం : సల్మాన్ ఖాన్, అతని తండ్రికి బెదిరింపు లేఖ .. రంగంలోకి పోలీసులు

సారాంశం

బాలీవుడ్  సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు గుర్తు తెలియని దుండగుడి నుంచి బెదిరింపులు వస్తున్నాయి. సల్మాన్ , అతని తండ్రిని బెదిరిస్తూ దుండగుడు బెదిరింపు లేఖ పంపాడు. దీనిపై స్పందించిన సల్మాన్ .. ముంబైలోని బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు

బాలీవుడ్  (bollywood) సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు (salman khan) గుర్తు తెలియని దుండగుడి నుంచి బెదిరింపులు వస్తున్నాయి. సల్మాన్ , అతని తండ్రిని బెదిరిస్తూ దుండగుడు బెదిరింపు లేఖ (threat letter) పంపాడు. దీనిపై స్పందించిన సల్మాన్ .. ముంబైలోని (mumbai police) బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లేఖ ఆధారంగా విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

కాగా.. పంజాబీ సింగర్, కాంగ్రెస్ (congress) నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో (sidhu moose wala ) ప్రధాన నిందితుడు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్టోయ్‌ (lawrence bishnoi) అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లారెన్స్ గతంలో సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడిన ఒక వీడియో మరోసారి తెరపైకి వచ్చింది. 2018 లో ఒక కేసులో లారెన్స్‌ బిష్ణోయ్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన అతడి అనుచరులకు ఢిల్లీ హైకోర్డు రిమాండ్ విధించింది. అప్పుడు మీడియా ముందు లారెన్స్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను ఏం చేయలేదని... కానీ, తాను ఏమి చేయగలనో, ఏం చేస్తానో అప్పుడే మీకు తెలుస్తుంది. రాజస్థాన్‌లో సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తాను... మీరేం చేస్తారో అప్పుడు చూస్తా” అంటూ వ్యాఖ్యానించాడు. 

అప్పట్లో ఈ వార్త సంచలనం సృష్టించింది.. అప్పటినుంచి పోలీసులు ఏ ఈ ముఠాపై నిఘా పెట్టారు. మధ్యలో సల్మాన్ ఇంటిపై రెక్కీ నిర్వహించిన ఈ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. తాజాగా మూసేవాలా దారుణ హత్య నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. తాజాగా సల్మాన్‌కు బెదిరింపు లేఖ నేపథ్యంలో ఆయనకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో