బడా నిర్మాణ సంస్థలో విరాట పర్వం దర్శకుడి చిత్రం... ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

Published : Jan 18, 2024, 11:39 AM IST
బడా నిర్మాణ సంస్థలో విరాట పర్వం దర్శకుడి చిత్రం... ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

సారాంశం

విరాట పర్వం మూవీతో సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు వేణు ఉడుగుల. బడా నిర్మాణ సంస్థలో ఆయన కొత్త మూవీ ఖాయం అయినట్లు తెలుస్తుంది.   

రానా-సాయి పల్లవి కాంబోలో విడుదలైన విరాట పర్వం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వాస్తవ సంఘటన ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా విరాట పర్వం తెరకెక్కింది. రానా నక్సలైట్ రోల్ చేశారు. 2022లో విడుదలైన విరాట పర్వం మూవీ కమర్షియల్ గా ఆడకున్నా మంచి చిత్రం అనిపించుకుంది. దర్శకుడు వేణు ఉడుగుల ప్రతిభను పలువురు మెచ్చుకున్నారు. 

విరాట పర్వం మూవీతో సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు వేణు ఉడుగుల. కాగా ఓ బడా నిర్మాణ సంస్థలో వేణు ఉడుగుల కొత్త ప్రాజెక్ట్ ఓకే అయ్యిందట. రాజా సాబ్, ఈగిల్ వంటి భారీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో వేణు ఉడుగుల మూవీ తెరకెక్కనుందట. కాగా ఈ ప్రాజెక్ట్ ఓ నవల ఆధారంగా రూపొందిస్తున్నారట. నవల హక్కులు కొనుగోలు చేసిన సంస్థ మూవీ నిర్మిస్తున్నారట. 

త్వరలో వేణు ఉడుగుల కొత్త ప్రాజెక్ట్ పై అధికారిక సమాచారం రానుందట. ఈ మేరకు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈసారి వేణు ఉడుగుల కమర్షియల్ గా కూడా సక్సెస్ కానున్నాడని టాక్ నడుస్తుంది. వేణు ఉడుగుల నుండి రానున్న ఆ  ప్రాజెక్ట్ పై ఆసక్తి నెలకొంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Roja Selvamani: సినిమాలు వదిలి పారిపోదామనుకున్న రోజా.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో తెలుసా?
మహేష్, బన్నీ లది ఒక లెక్క, చిరంజీవిది మరో లెక్క..వరల్డ్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ కి మెగాస్టార్ ప్లాన్