మరోసారి గొంతు సవరించబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈసారి ఏ సినిమా కోసం అంటే..?

Published : Jan 18, 2024, 10:15 AM IST
మరోసారి గొంతు సవరించబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈసారి ఏ సినిమా కోసం అంటే..?

సారాంశం

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి గొంతు సవరించబోతున్నారా అంటే... అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. పవన్ స్టార్ కోసం ఓ పవర్ ఫుల్ సాంగ్  రెడీ అవుతుందట..   


అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు ఏమాత్రం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓ వైపు రాజకీయాలతో మరో వైపు సినిమాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యేలా ఫుల్ బిజీ షెడ్యూల్స్ మధ్య నలిగిపోతున్నారు. అయినా సరే సినిమాల విషయంలో ఏమాత్రం వెనకడుకు వేయకుండా దూసుకుపోతున్నాడు పవర్ స్టార్. ఆమధ్యే  రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ తో కలిసి బ్రో  సినిమాలో నటించారు. ఈ సినిమా  యావరేజ్ టాక్ తో నడిచి..పర్లేదు అనిపించుకుంది. అయితే పవర్ స్టార్ రెండు సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్.. క్రిష్ తో హరిహర వీరమల్లు రెండు పెండ్డింగ్ లో ఉన్నాయి. 

ఇక ఆరెండు సినిమాలు వదిలేసి..  ఇప్పుడు పవన్ సుజిత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.  ఓజీ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవర్ స్టార్ డిఫరెంట్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.  సుజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రన్ రాజా రన్ సినిమాతో మంచి దర్శకుడు అనింపిచుకున్న సుజిత్.. ప్రభాస్ తో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా  సాహో సినిమా చేసి  నిరాశపరిచాడు. ఈమూవీ మంచి కలెక్షన్లు సాధించింది. బాలీవుడ్ లో బాగా నడిచింది. కాని తెలుగు రాష్ట్రాల్లోనే దెబ్బతిన్నది సాహో మూవీ. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా కలెక్షన్స్ మాత్రం కుమ్మేసింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధించింది.

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఓజీ అనే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి గ్లింప్స్ విడుదలై ప్రేక్షకులను అలరించింది . ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నాడు. అలాగే కలకత్తా బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతుంది.

పవన్ కళ్యాణ్ హీరోగానే కాదు కొన్ని సినిమాలకు తన వాయిస్ కూడా ఇచ్చాడు. చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో తన వాయిస్ వినిపించాడు. అలాగే తన సినిమాల్లో కొన్ని పాటలు కూడా పాడారు.జానీ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల్లో పాటలు పాడారు పవన్. ఇక ఇప్పుడు ఇప్పుడు మరోసారి తన వాయిస్ వినిపించనున్నాడని తెలుస్తోంది. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ తన వాయిస్ వినిపించనున్నారట. ఓజీ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. పవన్ తో ఈ సినిమాలో ఓ పాట పాడించాలని తమన్ ప్లాన్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ పాటతో ఫ్యాన్స్ థియేటర్స్ లో దుమ్మురేపడం ఖాయం అంటున్నారు అభిమానులు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు