మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవం అందుకోనున్నారని సమాచారం. భారత ప్రభుత్వం ఆయన్ని పద్మ విభూషణ్ తో సత్కరించనుందట.
చిరంజీవి నాలుగు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై ఆయన తిరుగులేని స్టార్ డమ్ అనుభవించారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన్ని అనేక అవార్డులు, రివార్డులు వరించాయి. భారత ప్రభుత్వం 2006లో మూడవ అతిపెద్ద పౌర పురస్కారం అయిన పద్మ భూషణ్ తో చిరంజీవిని సత్కరించింది. అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా చిరంజీవి పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు.
కాగా భారత ప్రభుత్వం చిరంజీవిని పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పద్మ విభూషణ్ భారత ప్రభుత్వం ఇచ్చే రెండవ అతిపెద్ద పౌర పురస్కారం కావడం విశేషం. అతికొద్ది మంది నటులు మాత్రమే పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. తెలుగులో లెజెండరీ యాక్టర్ నాగేశ్వరరావు ఈ గౌరవం అందుకున్నారు. అమితాబ్, రజినీకాంత్ వంటి హీరోలను ప్రభుత్వం పద్మ విభూషణ్ తో సత్కరించింది. మరి నిజంగా చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన కూడా ఈ లెజెండ్స్ లిస్ట్ లో చేరుతారు.
మరోవైపు చిరంజీవి వరుస చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం వశిస్ట్ దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఇది సోషియో ఫాంటసీ సబ్జెక్టు తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం అని సమాచారం. సంక్రాంతి కానుకగా టైటిల్ అండ్ కాన్సెప్ట్ టీజర్ విడుదల చేశారు. గత ఏడాది చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్. భోళా శంకర్ మాత్రం నిరాశపరిచింది.