ఆకాశవాణి ముఖ్యాంశాలు అంటూ.. డిఫరెంట్ గా ప్లాన్ చేసిన విరాటపర్వం టీమ్, స్పెషల్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..?

Published : May 31, 2022, 08:10 PM IST
ఆకాశవాణి ముఖ్యాంశాలు అంటూ.. డిఫరెంట్ గా ప్లాన్ చేసిన విరాటపర్వం టీమ్, స్పెషల్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..?

సారాంశం

ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అవుతుంది విరాటపర్వం మూవీ. దాదాపు మూడేళ్ళ నిరీక్షణ తరువాత రిలీజ్ అవుతుండటంతో.. ప్రమోషన్స్ ను కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు టీమ్. 

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా... ప్రియమణి లాంటి స్టార్స్  కలిసి నటించిన సినిమా విరాటపర్వాం  వేణు ఊడుగుల దర్శకత్వంలో  తెరకెక్కిన ఈసినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. నీది నాది ఒకే కథ' చిత్రంతో వేణు ఊడుగుల విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. దీనితో విరాటపర్వం కథని చాలా బలంగా రాసుకున్నారు. నక్సలిజం బ్యాక్  డ్రాప్ లో రానా ఎంచుకున్న మరో ప్రయోగాత్మక సినిమాఇది.  

సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈసినిమా... చాలా రోజుల క్రితమే షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇక రిలీజ్ కు రెడీ అవుతుండగా ఏదో ఒక అడ్డంకులు ఈ చిత్రానికి ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కరోనా వల్ల చాలా కాలం ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. కరోనా తగ్గుముఖం పట్టక రిలీజ్ కి మంచి సమయం కుదర్లేదు. ఇక ఎట్టకేలకు విరాటపర్వం చిత్రం థియేటర్స్ లోకి తీసుకువచ్చేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. తాజాగా అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించారు. జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. 

 

అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో... ప్రమోషన్స్ షురూ చేశారు టీమ్. జూన్ 2 నుంచి అఫీషియల్ గా మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. అయితే కొంచెం డిఫరెంట్ గా ఈ మూవీ ప్రమోషన్స్ ను చేయబోతున్నారు. 2న రిలీజ్ కాబోయే నగధారిలో పాటకు సంబంధించిన అనౌన్స్ మెంట్ ను డిఫరెంట్ గా ఇచ్చారు. దూరదర్శన్ వార్తలు చదువుతున్నట్టుగా విరాటపర్వంలోని ముఖ్యాంశాలు.. నగదారిలో పాటతో విరాటపర్వం ప్రమోషన్స్ జూన్ 2 నుంచి స్టార్ట్ అవుతున్నాయంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు టీమ్. 

నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సాగే ఎమోషనల్ లవ్ స్టోరీతొ కూడిన సినిమా విరాటపర్వం ట్రాజిడీ ఎండింగ్ ఉండబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా కథ  గురించి ఇంకా అనేక ఊహాగానాలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఈసినిమాలో రానా, సాయి పల్లవితో పాటు నందిత దాస్, ప్రియమణి, నివేత పేతురేజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం