ప్లాప్ ల డైరెక్టర్ తో నాగార్జున సినిమా.. రిస్క్ చేస్తున్న సీనియర్ హీరో

Published : May 31, 2022, 07:40 PM IST
ప్లాప్ ల డైరెక్టర్ తో నాగార్జున సినిమా.. రిస్క్ చేస్తున్న సీనియర్ హీరో

సారాంశం

కింగ్ నాగార్జున సాహసం చేయబోతున్నాడు. టాలీవుడ్ సమాచారం ప్రకారం ఓ ప్లాప్ డైరెక్టర్ కు నాగ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇంతకీ నాగ్ సినిమా చేయబోయేది ఎవరితో

వరుస సినిమాల ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడ్డ సీనియర్ హీరో కింగ్ నాగార్జున బంగార్రాజు సినిమాతో సూపర్ సక్సెస్ సాధించాడు. బంగార్రాజు ముందు నాగార్జున చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయన చేసిన  'బంగార్రాజు' భారీ వసూళ్లను రాబట్టింది. దాంతో మరో మాస్ యాక్షన్ మూవీ చేయాలనే ఉద్దేశంతో నాగార్జున ఉన్నారట. ఈ నేపథ్యంలో వరుసగా ప్లాప్స్ ఫేస్ చేస్తున్న డైరెక్టర్ తో సెట్స్ ఎక్కబోతున్నట్టు తెులస్తోంది. 

రీసెంట్ గా సిటీమార్ సినిమాతో మరో ప్లాప్ అందుకున్న డైరెక్టర్  సంపత్ నంది ఒక కథను నాగార్జునకు వినిపించాడట. నాగ్ వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. గతంలొ సంపత్ నంది ఖాతాలో రచ్చ,బెంగాల్ టైగర్ వంటి మాస్ హిట్స్ ఉన్నాయి. అందువలన ఆయన కథ విన్న నాగార్జున, పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేసుకుని రమ్మన్నారట. ప్రస్తుతం సంపత్ నంది అందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నాడని సమాచారం. నాగార్జునను కనుక ఆయన ఒప్పించగలిగితే వెంటనే సెట్స్ మీదకు వెళ్దామని చూస్తున్నాడట సంపత్ నంది. 

నాగార్జున  ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో  ది ఘోస్ట్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో  ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.  ఈ సినిమాలో నాగ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. గరుడవేగ తరువాత ప్రవీణ్ చేసిన సినిమా కావడంతో అందరిలోను ఆసక్తి ఉంది. ఈ సినిమాలో నాగ్ జోడీగా సోనాల్ మెరవనుంది.
 

PREV
click me!

Recommended Stories

Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే
Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది