హిట్టుకోసం బాలయ్య సెంటిమెంట్ కాంబో..

By Prashanth MFirst Published May 6, 2019, 7:13 PM IST
Highlights

ఎన్టీఆర్ బయోపిక్ తో ఊహించని డిజాస్టర్స్ అందుకున్న నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ డిఫరెంట్ యాక్షన్ మూవీతో రానున్నాడు. మొదట బోయపాటి దర్శకత్వంలో సినిమా ఉంటుందని అనుకున్నప్పటికీ బాలయ్య ఊహించని విధంగా ప్లాన్ చేంజ్ చేశాడు.

ఎన్టీఆర్ బయోపిక్ తో ఊహించని డిజాస్టర్స్ అందుకున్న నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ డిఫరెంట్ యాక్షన్ మూవీతో రానున్నాడు. మొదట బోయపాటి దర్శకత్వంలో సినిమా ఉంటుందని అనుకున్నప్పటికీ బాలయ్య ఊహించని విధంగా ప్లాన్ చేంజ్ చేశాడు. ఈ సారి కూడా కాంబో సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడు.  

ప్ర‌ముఖ దర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శక‌త్వంలో ఓ సినిమా ప్రారంభం కానుంది. ప్ర‌ముఖ నిర్మాత, సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. `జైసింహా` వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న చిత్ర‌మిది. ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా న‌టించ‌బోతున్నారు. 

బ్లాక్‌బ‌స్ట‌ర్ `లెజెండ్‌` త‌ర్వాత బాల‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్‌లో ఈ చిత్రం రూపొంద‌నుంది. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చిరంత‌న్ భ‌ట్ సంగీత సార‌థ్యం వహిస్తున్నారు.  ఇక ఈ హిట్ కాంబోలో సినిమా మే 17న లాంఛనంగా ప్రారంభమై  జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ కొనసాగనుంది. మరి ఈ హిట్ కాంబినేషన్స్ తో బాలయ్య ఏ స్థాయిలో హిట్ అందుకుంటాడో చూడాలి.

click me!