కీరవాణికి కరోనా పాజిటివ్ ..? వైరల్ అవుతున్న న్యూస్.. నిజమెంత..?

By Mahesh Jujjuri  |  First Published Mar 29, 2023, 8:35 AM IST

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కరోనా బారిన పడ్డారా..? మరి రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి ఎలా వచ్చారు...? బాలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాలలో నిజం ఎంతా..? 


ఆర్ఆర్ఆర్ సినిమాకు రీసెంట్ గా  ఆస్కార్ అందకున్నారు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి.ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోవడంతో మరో మెట్టు పైకెక్కారు. ఆయన మ్యూజిక్ చేసిన ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ స్థాయిలో జయకేతనం ఎగరవేయడంతో పాటు.. ఈసినిమాకు ఆయన సమకూర్చిన స్వరాలు ఆస్కార్ తో పాటు ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ ను సాధించి పెట్టాయి. దాంతో కీరవాణి ఇమేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది.  ఇక  ఆస్కార్‌ ఈవెంట్‌ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన కీరవాణి  పూర్తిగా బెడ్‌ రెస్ట్‌కే పరిమితమయ్యారట. కొన్ని రోజులు బయటకు రాకుండా గడిపేశారట. 

ఆర్ఆర్ఆర్ మూవీని అంతర్జాతీయ స్థాయిలో  ప్రమోషన్స్ కోసం రెండు నెలలకు పైగా ఫారెన్ లో ఉన్నారు కీరవాణి. అక్కడ వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ.. రెస్ట్ లెస్ గా  ప్రయాణాలు చేశారు. కొంచెం కూడా ఖాళీ లేకుండా ఆర్ఆర్ఆర్ కోసం కష్టపడ్డారు. దాంతో కీరవాణి బాగా  అలసిపోయారట. ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత ఇండియా వచ్చినతర్వాత ఆరోగ్యం బాగాలేదని అనిపించడంతో కీరవాణి కరోనా టెస్ట్  కూడా ఇచ్చారట.   ఈ టెస్ట్ చేయించుకున్న తరువాత..  అందులో కీరవాణికి  కరోనా పాజిటివ్ వచ్చినట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఈ విషయం స్వయంగా కీరవాణి ఓ నేషనల్ మీడియాకు తెలిపినట్టు న్యూస్ వైరల్ అవుతోంది. 

Latest Videos

అయితే కీరవాణి ప్రస్తుతం కోలుకున్నారని తెలుస్తోంది.  ఆయన బాగానే ఉన్నారని ఇంట్లోనే ఉండి పూర్తిగా రెస్ట్ తీసుకుని రీసెంట్ గా బయటకు వచ్చారట. ఈవిషయం కూడా కీరవాణి స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది. మొన్న రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో కూడా ఆయన సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కీరవాణి దంపతులను సన్మానించారు. కరోనా నుంచి కోలుకున్నారు కాబట్టే ఈ పార్టీకి ఆయన వచ్చారా... లేక కీరవాణికి కరోనా పాజిటివ్ అన్నది ఒక రూమర్ మాత్రమేనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే  నార్త్  మీడియాలో ఈ విషయంపై జరిగిన ప్రచారం నిజమేనా? అనే విషయంపై సరైన క్లారిటీ లేదు. ఇక ఈ విషయంలో కీరవాణి కానీ ఆయన ఫ్యామిలీ కాని స్పందిస్తే.. కాని అసలునిజం బయటకు వస్తుంది. మరి ఈ వైరల్ న్యూస్ చూసి.. వారి కుటుంబ సభ్యులు  క్లారిటీ ఇస్తారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక కీరవాణి నెక్ట్స్ రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్ సినిమాకు పనిచేయబోతున్నారు. ఈమూవీ ప్రీ ప్రొడక్షన్ అప్పుడే స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈమూవీతో మరిన్ని రికార్డ్స్ బ్రేక్ చేయాలని చూస్తున్నారు జక్కన్న టీమ్. 

click me!