ప్రభాస్ డైరెక్టర్ తో శివకార్తికేయన్ సినిమా..? టాలీవుడ్ ను టార్గెట్ చేసిన తమిళ నేచురల్ స్టార్

By Mahesh Jujjuri  |  First Published Mar 28, 2023, 11:10 PM IST

ప్రభాస్ దర్శకుడితో సినిమాకు రెడీ అవుతున్నాడు తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్. టాలీవుడ్ లో డైరెక్ట్ గా రెండో సినిమా చేయబోతున్నాడు  కోలీవుడ్ నేచురల్ స్టార్. ఇంతకీ ఈ వార్తల్లో నిజమెంత. ? 



ఒకప్పటిలా కాదు ఇప్పుడు ట్రెండ్ మారింది. మన తెలుగు దర్శకుల కోసం తమిళ హీరోలు క్యూకడుతున్నారు తమిళ స్టార్ హీరోలు.ఇప్పటికే విజయ్, ధనుష్ లాంటి హరోలు వరుసగా తెలుగు నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు చేస్తుండగా.. అదే బాటలో నడుస్తున్నాడు తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్ రెమో,డాక్టర్ వరుణ్,డాన్‌ లాంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గర అయిన శివకార్తికేయన్, తాజాగా జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ తో కలిసి ప్రిన్స్ మూవీ చేశారు.ఇప్పుడు మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అది కూడా ప్రభాస్ తో పాన్ఇండియా మూవీ చేసిన రాధాకృష్ణ కుమార్ తో. 

అయితే రాధాకృష్ణకుమార్ ప్రభాస్  చేసిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ డిజాస్టర్ గా నిలిచింది. ఈసినిమా తరువాత రాధాకృష్ణకు అవకాశాలు రాలేదు. భారీ బడ్జెట్ సినిమా చేసిన రాధాకృష్ణ.. ఒక్కసారిగా చిన్న సినిమాలు చేయడం కష్టం. డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రారు. కాని రాధా.. తన కథతో శివకార్తికేయన్ ను మెప్పించినట్టు తెలుస్తోంది. రాధాకృష్ణ కథ చెప్పడం.. అది  కార్తికేయన్‌కు నచ్చడంతో పాటు.. సినిమాను కూడా త్వరగానే స్టార్ట్ చేద్దాం అన్నారట యంగ్ హీరో. దాంతో మూవీని వెంటనే స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Latest Videos

గోపీచంద్ తో జిల్, ప్రభాస్‌తో రాధేశ్యామ్ సినిమాలను తెరకెక్కించిన రాధాకృష్ణ కుమార్ శివకార్తికేయన్ ను డైరెక్ట్ చేయడం దాదాపు కన్ ఫార్మ్ అయినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈసినిమాను సాహో సినిమాను నిర్మించిన  యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందని సమాచారం. అయితే శివకార్తికేయన్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు పూర్తి చేసి రాధాకృష్ణతో సినిమాను పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నారట. ఇక ఈమూవీ గురించి  అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అంతే కాదు శికార్తికేయన్ ఆసారి టాలీవుడ్ పై గట్టిగా దృష్టి పెట్టాడు. తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా.. శివకార్తియేయన్ కు  కాస్తో కూస్తో ఇక్కడ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దాన్ని ఇంప్రూ చేసుకుని.. తన ఇమేజ్ ను టాలీవుడ్ లో పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు యంగ్ హీరో. టాలీవుడ్ లో చిన్నగా పాతుకుపోయి...ఇక్కడ నుంచి పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేయాలని చూస్తున్నాడట తమిళ నేచురల్ స్టార్. మరి శివకార్తికేయన్ ప్రయత్నం ఎంత వరకూ ఫలిస్తుందో చూడాలి. 

click me!