పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘బ్రో : ది అవతార్’. మూవీ నుంచి పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్టిల్ ఒకటి వైరల్ గా మారింది.
తమిళంలో భారీ ఎత్తున విజయం సాధించిన ‘వినోదయ సీతమ్’ చిత్రానికి రీమేక్ గా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘బ్రో : ది అవతార్’ (Bro The Avatar). పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరియు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని (Samuthirakani) డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఈ నెలలో రిలీజ్ కు కూడా ఉంది.
రీసెంట్ గా ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎనర్జీ లెవల్స్ నెక్ట్స్ లెవల్లో ఉన్నాయి. మరోవైపు ఈ చిత్రంలో పవర్ స్టార్ వింటేజ్ లుక్ లో దర్శనమివ్వబోతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే టీజర్ కు ముందు వదిలిన పోస్టర్లలో పవన్ వింటేజ్ లుక్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేశారు. లుంగీ కట్టుకొని ఉన్న పోస్టర్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా దర్శకుడు సముద్రఖని ‘బ్రో’ చిత్రం నుంచి పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్టిల్ ను అభిమానుల కోసం వదిలారు. మూవీలోని ఓ పార్టీ సాంగ్ లో పవన్ కళ్యాణ్ సందడి చేసినట్టు కనిపిస్తోంది. అందులో పవన్ కళ్యాణ్ కుడికాలిని గాల్లో లేపిన స్టిల్ ను సముద్రఖని షేర్ చేశారు. ఇదే స్టిల్ జల్సా సినిమాతో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మళ్లీ బిగ్ స్క్రీన్ పై వింటేజ్ స్టైల్ తో దుమ్ములేపబోతున్నట్టు కనిపిస్తోంది.
ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ స్టిల్ నెట్టింట వైరల్ గా మారింది. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. జూలై 28న చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
Our in 💪💪💪💪 pic.twitter.com/96mPF46okb
— P.samuthirakani (@thondankani)