
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో రెండవసారి తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టు పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ బాడీ లాంగ్వేజ్, ఫ్యాన్స్ అంచనాలు పూర్తిగా తెలిసిన దర్శకుడు హరీష్.
దీనితో హరీష్ తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసే చిత్రాన్నే తెరకెక్కిస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆల్రెడీ చిత్ర యూనిట్ ఒక షెడ్యూల్ కూడా ఫినిష్ చేసింది. తాజాగా చిత్ర యూనిట్ సెకండ్ షెడ్యూల్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.
త్వరలోనే భారీ సెకండ్ షెడ్యూల్ కి ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ రెడీ అవుతోందని చిత్ర యూనిట్ ప్రకటించింది. సెకండ్ షెడ్యూల్ కి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. చరిత్రని తిరిగి రాద్దాం అంటూ మైత్రి సంస్థ ట్వీట్ చేసింది.
ఫ్యాన్స్ కి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా కొన్ని పోస్టర్స్ వదిలారు. గబ్బర్ సింగ్ టైం లో పవన్, హరీష్ షూటింగ్ లొకేషన్ లో ఉన్న దృశ్యాలని.. ఉస్తాద్ సెట్స్ వీళ్ళిద్దరూ ఉన్న దృశ్యాలతో పోల్చుతూ ట్వీట్ చేశారు. దశాబ్దం గడిచినా హరీష్, పవన్ మధ్య బాండింగ్ మారలేదు అని అర్థం వచ్చేలా ఈ స్టిల్స్ ఉన్నాయి. తన టీం క్రియేట్ చేసిన ఈ పోస్టర్స్ కి డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా సర్ప్రైజ్ అయ్యారు.
తేరి చిత్రానికి రీమేక్ గా ఉస్తాద్ తెరకెక్కుతోంది అంటూ ముందుగా వార్తలు వచ్చాయి. కానీ హరీష్ శంకర్ తేరిలోని అంశం మాత్రమే తీసుకుని మిగిలిన కథని మొత్తం మార్చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ భగత్ అనే పోలీస్ అధికారిగా నటిస్తున్నారు.