వినాయక్ పరిస్థితి ఇలా అయ్యిందేంటి?

Published : Oct 13, 2018, 10:18 AM IST
వినాయక్ పరిస్థితి ఇలా అయ్యిందేంటి?

సారాంశం

టాలీవుడ్ స్టార్ దర్శకుల లిస్ట్ తీస్తే అందులో వివి.వినాయక్ పేరు తప్పకుండా ఉంటుంది. యాక్షన్ ఫ్యాక్షన్ అలాగే కామెడీ ఎంటర్టైనర్ ను కలగలిపి మెప్పించగల దర్శకుడు వినాయక్. దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. 

టాలీవుడ్ స్టార్ దర్శకుల లిస్ట్ తీస్తే అందులో వివి.వినాయక్ పేరు తప్పకుండా ఉంటుంది. యాక్షన్ ఫ్యాక్షన్ అలాగే కామెడీ ఎంటర్టైనర్ ను కలగలిపి మెప్పించగల దర్శకుడు వినాయక్. దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. వినాయక్ అంటే ఒకప్పుడు ఏ హీరో అయినా డేట్స్ ఇవ్వడానికి ముందుకొచ్చేవారు. 

అఖిల్ లాంటి డిజాస్టర్ సినిమా తరువాత కూడా మెగాస్టార్ చిరంజీవి తన రీ ఎంట్రీ కోసం వినాయక్ నే ఎంచుకున్నాడంటే ఆయన ప్రతిభపై ఎంత నమ్మకమో చెప్పవచ్చు. కానీ వాతావరణం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఇంటిలిజెంట్ సినిమా తరువాత వినాయక్ పరిస్థితి మరి దారుణంగా తయారైంది. సి.కళ్యాణ్ మరో సినిమా నిర్మించాలని అతనితో ఒప్పందం కుదుర్చుకున్నాడు.   

నిర్మాత దొరికినా దర్శకుడికి కథానాయకుడు దొరకలేదు. బాలకృష్ణ సినిమా చేయడానికి ఒప్పుకున్నప్పటికీ కథతో మెప్పించలేకపోయాడు వినాయక్. చాలా మంది రచయితలను కలిశాడు. ఎన్నో కథలను చూసాడు. అయినా బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇతర హీరోలను కలిసినా కూడా వారు వినాయక్ అంటే వద్దు అనేస్తున్నారట. 

ఇక బాలకృష్ణ ఫైనల్ గా ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీ అయిపోయారు. ఆ చిత్రం తరువాత బాలయ్య బోయపాటితో ఒక సినిమా చేయనున్నారు. దీన్ని బట్టి వినాయక్ కి బాలకృష్ణతో చేసే అవకాశం చేజారినట్లే అని టాక్ వస్తోంది

PREV
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం