చిక్కుల్లో మోహన్ లాల్ 1000 కోట్ల మహాభారతం!

By Prashanth MFirst Published Oct 12, 2018, 5:19 PM IST
Highlights

సముద్రం లాంటి మహాభారతాన్ని తెరక్కించడమంటే అంత సాధారణమైన విషయం కాదు. ఆ కాలంలో సీనియర్ నటులు వారి స్టైల్ లో తెరకెక్కించి శబాష్ అనిపించుకున్నారు.రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అదేనని కెరీర్ మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు.

సముద్రం లాంటి మహాభారతాన్ని తెరక్కించడమంటే అంత సాధారణమైన విషయం కాదు. ఆ కాలంలో సీనియర్ నటులు వారి స్టైల్ లో తెరకెక్కించి శబాష్ అనిపించుకున్నారు.రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అదేనని కెరీర్ మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు. ఇక బాలీవుడ్ సైడ్ అమిర్ ఖాన్ కూడా మహాభారతంలో నటించడానికి సిద్ధమని అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని చెప్పేశాడు. 

అయితే అందరికంటే ముందే మోహన్ లాల్ భారీ బడ్జెట్ తో మహాభారతంలో నటిస్తున్నట్లు కొన్నేళ్ల క్రితం అధికారిక ప్రకటన వచ్చింది. 1000 కోట్లతో  ప్రముఖ వ్యాపార వేత్త బీఆర్‌ శెట్టి సినిమాను నిర్మించనున్నట్లు కథనాలు కూడా చాలానే వచ్చాయి.  ప్రముఖ రచయిత ఎమ్‌టీ వాసుదేవన్‌ నాయర్‌ రచించిన రంధమూలం నవల ఆధారంగా దర్శకుడు శ్రీ కుమార్ ఇంటర్నేషనల్ లెవెల్లో చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్నారు. 

స్క్రీన్ ప్లే ను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ చిత్రం షూటింగ్ మొదలవ్వకముందే అటకెక్కేటట్లు ఉందని ప్రస్తుతం పరిస్థితులను చుస్తే అర్ధమవుతోంది. ఎందుకంటే సినిమా రచయిత వాసుదేవన్ కోర్టును ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. మూడేళ్లకు కాంట్రాక్ట్ కుదుర్చుకొని సినిమాను స్టార్ట్ చేస్తామని చెప్పారు. నాలుగేళ్లయినా సినిమాను స్టార్ట్ చేయలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన రచయిత కథ కథనాలను తీరిగి ఇప్పించాలని కోర్టుమెట్లు ఎక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

click me!