వినరో భాగ్యము విష్ణు కథ సినిమా 3 డేస్ కలెక్షన్స్.. లాభమా..? నష్టమా..?

Published : Feb 21, 2023, 10:28 PM IST
వినరో భాగ్యము విష్ణు కథ సినిమా 3 డేస్ కలెక్షన్స్.. లాభమా..? నష్టమా..?

సారాంశం

రిలీజ్ అయ్యి మూడు రోజులు అవుతుండగా.. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా. ఈ మూవీ మూడు రోజుల కలెక్షన్స్ వివరాలు వెల్లడిస్తూ.. సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు మూవీ టీమ్. ఈ సందర్భంగా ఏం చెప్పారంటే..? 

కిరణ్ అబ్బవరం హీరోగా,  క‌శ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్‌గా జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వచ్చిన సినిమా వినరో భాగ్యము విష్ణు కథ.మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై  తెరకెక్కిన  ఈ సినిమా స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు  నిర్మాత‌గా తెరకెక్కింది. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన ఈసినిమా  ఫిబ్రవరి 18న రిలీజ్ అయ్యి.. సక్సెస్ పుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సినిమా మూడు రోజులు కలెక్షన్స్ గురించి వెల్లడించారు. 

వినరో భాగ్యము విష్ణు కథ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది అంటున్నారు నిర్మాత బన్నీ వాసు. ఈమూవీ మూడు రోజులకు 6.67 కోట్ల కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ సాధించిందన్నారు బన్నీవాసు. సినిమా విషయంలో టీమ్ అంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంకా ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండటంతో.. ప్రెస్ మీట్ పెట్టి మరీ తమ సంతోషాన్ని పంచుకున్నారు టీమ్. ఈ సక్సెస్ మీట్ లో నిర్మాత బన్నీవాసుతో పాటు హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ పర్ధేశీ, డైరెక్టర్ , ఇతరటీమ్ పాల్గోన్నారు. ఇక బన్నివాసు మాట్లాడుతూ  నిర్మాతగా నేను ఈ సినిమా పట్ల హ్యాపీగా ఉన్నాను. నేను తీసిన అన్ని సినిమాల్లోకెల్లా త్వరగా బ్రేక్ ఈవెన్ అయింది ఈ సినిమానే. కొత్త వారి మీద చాలా ఎక్కువగా ఖర్చు పెట్టారా? అని అంతా అడుగుతున్నారు. అరవింద్ గారి వద్ద ఉన్న క్రమశిక్షణ వల్లే ఖర్చు హద్దుల్లో ఉండగలిగింది. అదే మా టీం సక్సెస్ సీక్రెట్. మా టీం వల్లే ఇదంతా సాధ్యమైంది అన్నారు. హీరో కిరణ్ చాలా వినయంగా ఉంటారు. అన్నారు బన్నివాసు. 

ఇక ఈసినిమా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. సక్సెస్ మీట్‌లు పెట్టినప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాదు. సినిమా ఆడకపోతే.. నేను బయటకు కనిపించను. ఆడియెన్స్‌ ఇచ్చే రిజల్ట్‌ను నేను గౌరవిస్తాను. ఇప్పటి వరకు నేను ఐదు సినిమాలు చేశాను. ఏ సినిమా గురించి కూడా ఇలా మీడియా వచ్చి మాట్లాడలేదు. ఇండస్ట్రీ ప్రముఖులందరూ కూడా సినిమాను చూసి మెచ్చుకున్నారు. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి చూడాలి అంటూ ఆడియన్స్ కి విజ్ఞప్తి చేశారు కిరణ్. 


హీరోయిన్ క‌శ్మీర ప‌ర్ధేశీ మాట్లాడుతూ.. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు థాంక్స్. ఇలాంటి మంచి సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. మొదటి సినిమా వర్కౌట్ కాకపోతే.. రెండో చాన్స్ ఇవ్వరు. కానీ నాకు గీతా ఆర్ట్స్ అవకాశం ఇచ్చింది. ఇంత మంచి చిత్రంలో భాగం అయినందుకు ఆనందంగా ఉంది. కిరణ్ మంచి నటుడు ఆయనతో కలిసి నటించడం చాలా కంఫర్ట్ అనిపించింది అన్నారు. 

ఇక ఈసినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన  మురళీ కిషోర్ అబ్బూరు మాట్లాడుతూ..  ఇది కేవలం నంబర్ నైబర్ కాన్సెప్ట్ కోసం తీసింది కాదు. అమ్మ సెంటిమెంట్ ఉంటుంది. ఆడపిల్ల కంట్లో నీళ్లు వస్తే విష్ణు ఏం చేస్తారో చెప్పే కథ ఇది. మంచి అనేది వ్యాప్తి చెందడానికి టైం పడుతుంది. కానీ అది స్టార్ట్ అయితే ఆగదు. ఆ డైలాగ్‌ మాకు సరిగ్గా సరిపోద్ది' అని అన్నారు.


 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?