
వరుస వివాదాలతో ఎప్పటికప్పుడు కష్టాలు కొనితెచ్చుకుంటుంది ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ. ఈసారి కూడా ఆమె చేసిన వీడియో ఒకటి వివాదాలు తెచ్చిపెట్టింది. మరి ఈసారి ఏం చేసిందంటే..?
ప్రముఖ జానపద గాయని మంగ్లీ మరో వివాదంలో చిక్కుకుంది. ఎప్పుడూ ఏదో ఒక పని చేసి వివాదాలు కొనితెచ్చుకుంటుంది మంగ్లీ.. ఈసారి కూడా అలానే ఓ వివాదాన్ని మోస్తుంది. ప్రతీ పెద్ద పండక్కి ఏదో ఒక వీడియో చేస్తుంటుంది మంగ్లీ. ముఖ్యంగా ఆమె ప్రతీ శివరాత్రికి మహాశివుని గురించి చేసే వీడియో సాంగ్స్ కు బాగా డిమాండ్ ఉంటుంది. అయితే ఈమధ్య ఆమె చేసే పనులు, కొన్ని వీడియోలు వివాదాస్పదం అవుతున్నాయి. ఈక్రమంలోనే ఈసారి మహాశివరాత్రి సందర్భంగా మంగ్లీ చేసిన పాట కూడా కాంట్రవర్సీ అయ్యింది.
రీసెంట్ గా మహా శివరాత్రి సందర్భంగా ఆమె ఓ పాటను రిలీజ్ చేసింది. అయితే ప్రస్తుతం ఆ పాట భారీ వివాదాన్నే క్రియేట్ చేసింది. ఆ పాటను మంగ్లీ శ్రీకాళహస్తి లో షూట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పాటే వివాదానికి దారి తీసింది. మహా శివరాత్రి సందర్భంగా మంగ్లీ శివునిపై ఓ పాటను పాడుతూ గుళ్లో షూట్ చేసింది. ఈ పాట షూటింగ్ శ్రీకాళహస్తిలోని కాలభైరవ స్వామి ఆలయంలో స్పటిక లింగం దగ్గరలో జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి లోని కాలభైరవస్వామి ఆలయంలో ఎలాంటి షేటటింగ్స్ కు అనుమతి లేదు. గతంలో ఓ 20 ఏళ్ళ క్రిందటివరకూ జరిగినా.. ఆతరువాత ఇలాంటి వాటినికి అనుమతి ఇవ్వడంలేదు ఆలయ అధికారులు.
అయితే మంగ్లీ పాట షూటింగ్ కు అనుమతి లేకున్నా ఎలా షూట్ చేశారనే విషయంపై వివాదం నెలకొంది. అది కూడా గుడి మూసిన తరువాత అక్కడికి ఎవరినీ వెళ్ళనివ్వరు. అటువంటిసమయంలో స్వామివారి ఆలయంలో పాటను ఎలా షూట్ చేస్తారని, అనుమతి లేకున్నా మంగ్లీ షూట్ ఎలా చేసిందంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మంగ్లీ పాడిన ఆ పాటను ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ్ రచించగా ఆ పాట ఎంతో పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో ఆ పాట వైరల్ అవుతోంది.
కాలభైరవ స్వామి ఆలయంతో పాటు.. రాయల మండపం, రాహు కేతు మండపం, ఊంజల్ సేవ మండపాలలో మంగ్లీ షూటింగ్ చేసినట్టుగా ఆ పాట వీడియోలో కనిపిస్తోంది. ఇక ముక్కంటి ఆలయంలో మంగ్లీ ఆటాపాటలు ఇప్పుడు వివాదానికి దారి తీస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ చేసుకుని యూట్యూబ్‌లో విడుదల చేయడం మీద ఇప్పుడు భక్తులు మండిపడుతున్నారు. మరి ఈ వీవాదం ఎంత వరకూ దారి తీస్తుందో చూడాలి.