గ్యాప్ లేకుండా సినిమాలను విడుదల చేస్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha). మహాశివరాత్రి సందర్భంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. థ్రిల్లర్, యాక్షన్, సప్సెన్స్ అంశాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. కిరణ్ నటనకు, ఎంచుకున్న కథ, తెరకెక్కించిన విధానం ఆడియెన్స్ ను ఆకట్టుకున్నట్టు తెలుస్తోంది. తొలిరోజు టాక్ కాస్తా ఫర్లేదనే వినిపించింది. ఈ క్రమంలో ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు కూడా అందాయి.
ముఖ్యంగా ఈ చిత్రం ఏపీ మరియు తెలంగాణ కలెక్షన్లు ఇలా ఉన్నాయి. ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం..
undefined
నైజాం - రూ. 1.26 కోట్లు
యూఏలో - 19.67 లక్షలు
తూర్పు గోదావరి - 18.5 లక్షలు
పశ్చిమ గోదావరి - 12 లక్షలు
గుంటూరు - 12 లక్షలు
కృష్ణ - రూ. 13 లక్షలు
నెల్లూరు - రూ.8 లక్షలు వసూల్ చేసింది.
ఓవర్సీస్ - రూ.20 లక్షలు
మరోవైపు సీసెడ్, ఓవర్సీస్ కలుపుకొని మంచి కలెక్షన్స్ రాబట్టిందని మేకర్స్ స్వయంగా ప్రకటించారు. ఇండియా వైడ్ గా మొత్తం రోజు దాదాపు రూ.2.5 (Incl.Ceeded) కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసిందని తెలుస్తోంది. ఇక గోబ్లల్ గా ఈ చిత్రం ఫస్ట్ డే రూ.2.75 కోట్లకు పైగా వసూల్ చేసిందని ప్రకటించారు. తొలిరోజు ఈమేరకు కలెక్షన్లు రాబట్టడం చూస్తుంటే మున్ముందు మరింతగా కలెక్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇక సినిమాను సక్సెస్ బాటలో నడిపిస్తున్నందుకు కిరణ్ అబ్బవరం అభిమానులు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
చిత్రంలో కిరణ్ అబ్బవరం.. విష్ణు పాత్రలో జీవించారు. హీరోయిన్ గా కశ్మీర పర్ధేశీ (Kashmira) ఆకట్టుకున్నారు. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతోనే డెబ్యూ డైరెక్టర్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత బన్నీ వాసు నిర్మించారు. చైతన్ భరద్వాజ్ అద్బుతమైన సంగీతం అందించారు. చిత్రంలో మురళీ శర్మ, ఎల్‌బి శ్రీరామ్, దేవి ప్రసాద్, ఆమని, ప్రవీణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ‘మీటర్’,‘రూల్స్ రంజన్’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ ఏడాదే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.