దాదాపు 15 సంవత్సరాల క్రితం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం నటనకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
రవితేజ హీరోగా కొంతకాలం క్రితం వచ్చిన 'విక్రమార్కుడు' భారీ విజయాన్ని సాధించింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రవితేజ డ్యూయెల్ రోల్ చేశాడు. మాస్ యాక్షన్ తో పాటు కావలసినంత ఎమోషన్ కూడా ఉండటంతో, ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ రూపొందనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. విజయేంద్ర ప్రసాద్ సీక్వెల్ కథను వేరే దర్శకుడికి ఇస్తున్నాడనీ, బడా బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుందనే ప్రచారం జరుగుతోంది.
ఆ డైరక్టర్ మరెవరో కాదు… ఇటీవల సీటిమార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న సంపత్ నంది అని అంటున్నారు. ఇక రవితేజ సంపత్ నంది కాంబినేషన్ లో గతంలో బెంగాల్ టైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా యావరేజ్ అనిపించుకుంది. అయితే ఈ న్యూస్ లో ఎంతమాత్రం వాస్తవం లేదనేది తాజాగా వినిపిస్తున్న మాట. రవితేజ 'కిక్' సినిమాకి సీక్వెల్ గా 'కిక్ 2' చేయగా అది పెద్దగా ఆడలేదు. అప్పటి నుంచి ఆయన సీక్వెల్ సినిమాలపై ఆసక్తిని చూపడం లేదట. అందువలన ఆయన 'విక్రమార్కుడు' సీక్వెల్ చేసే అవకాశమే లేదని అంటున్నారు.
మాస్ మహారాజా రవితేజ… ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. చాలా కాలం తర్వాత రవితేజ ఇటీవల క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత మరోసారి రవితేజ మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు చేస్తున్నాడు. అలాగే.. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నాడు.