లైగర్ టీంతో లెజెండ్.. బాలయ్య, విజయ్ దేవరకొండ కూల్ పిక్ వైరల్

pratap reddy   | Asianet News
Published : Sep 22, 2021, 01:38 PM IST
లైగర్ టీంతో లెజెండ్.. బాలయ్య, విజయ్ దేవరకొండ కూల్ పిక్ వైరల్

సారాంశం

కుర్రాళ్లతో క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి చిత్రాలు విజయ్ క్రేజ్ ని పెంచాయి. ఇక నందమూరి నటసింహం బాలయ్య గురించి చెప్పేదేముంది. 

కుర్రాళ్లతో క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి చిత్రాలు విజయ్ క్రేజ్ ని పెంచాయి. ఇక నందమూరి నటసింహం బాలయ్య గురించి చెప్పేదేముంది. ఇప్పటికి బాలయ్య కుర్ర హీరోలతో పోటీ పడుతూ దూసుకుపోతున్నారు. అలాంటి బాలయ్య, విజయ్ దేవరకొండ ఒక ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది ? అభిమానులు క్రేజీగా మారిపోవడం ఖాయం. 

బాలయ్య, విజయ్ దేవరకొండ కలసి ఉన్న పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 'లైగర్' మూవీలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. 

ఎప్పటిలాగే ఈ చిత్రాన్ని పూరి, ఛార్మి నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. విజయ్ దేవరకొండపై పూరి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. లైగర్ సెట్స్ లో బాలకృష్ణ తళుక్కున మెరిసి చిత్ర యూనిట్ ని సర్ ప్రైజ్ చేశారు. బాలయ్య కూడా గోవాలోని అఖండ షూటింగ్ లో ఉన్నారు. 

దీనితో పక్కనే ఉన్న లైగర్ సెట్స్ ని సందర్శించారు. లైగర్ టీం పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ, ఛార్మి లని బాలయ్య కలిశారు. బాలయ్యతో కలసి లైగర్ టీమ్ దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ క్యాజువల్ వేర్ లో కనిపిస్తుండగా, బాలయ్య టక్ చేసుకుని టిప్ టాప్ గా ఉన్నారు. అందరు ముఖాల్లో హ్యాపీ స్మైల్ కనిపిస్తోంది. అఖండ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం దసరాకి రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. లైగర్ రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. 

PREV
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌