ఛత్రపతి శివాజీ జీవితంపై సినిమాకు కథ రాస్తా- విజయేంద్ర ప్రసాద్

First Published May 6, 2017, 6:31 AM IST
Highlights
  • బాహుబలి  కథ రాయటంతో దేశవ్యాప్తంగా కెవి విజయేంద్ర ప్రసాద్ కు యమా క్రేజ్
  • దీని తర్వాత ఆరంభ్ టీవీ సిరీస్ కు కథ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్
  • ఛత్రపతి శివాజీ జీవితంపై కథ రాయాలన్నది తన ఆశ అంటున్న విజయేంద్ర ప్రసాద్

బాహుబలి లాంటి దృశ్యకావ్యానికి కథ అందించిన రచయిత విజేంద్రప్రసాద్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా యమా క్రేజ్ ఉన్న రైటర్. భజరంగీ భాయిజాన్ లాంటి బాలీవుడ్ హిట్ సినిమాకూ కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు కథా రచయితల్లో టాప్ రైటర్. మరి బాహుబలి తర్వాత విజయేంద్ర ప్రసాద్ ఝాన్సీ లక్ష్మిబాయి జీవితంపై మణికర్ణిక కథను క్రిష్ కు అందించిన సంగతి తెలిసిందే. దాని తర్వాత విజయేంద్ర ప్రసాద్ పలు కథలు రాస్తున్నా... ఛత్రపతి శివాజీ జీవితంపైన మాత్రం తను కథ తప్పనిసరిగా రాయాలని కోరుకుంటున్నానంటారు.

 

విజయేంద్ర ప్రసాద్ ప్రస్థుతం ఆరంభ్ అనే టెలివిజన్ సిరీస్ కు రైటర్ గా పనిచచేస్తున్నారు. తల్లి పేరుతో పిలబడేరాజులు ఆ తర్వాత తమ పేర్లతోనే మహారాడజులుగా ఎలా కీర్తిపబడ్డారు. ఆర్యులు, ద్రవిడుల చరిత్ర ఏంటి లాంటి అంశాలతో ఆరంభ్ ఉంటుందని అన్నారు. ప్రపంచంతో పోటీపడుతున్న ఈ రోజుల్లో సినిమా అంటే ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు అందర్నీ థియేటర్లో కూర్చునేలా చేయగలిగేదే అంటారు విజయేంద్ర ప్రసాద్.

 

తాను ఇలాంటి కథలు రాయటానికి కారణం చిన్నతనం నుంచీ ఫాంటసీ కథలను ఎక్కువ ఇష్టపడటం, చందమామ కథలు లాంటి పుస్తకాలు చదవడం వల్లనే కారణమంటారు విజయేంద్ర ప్రసాద్.. అందుకే తన సినిమాల్లో యుద్ధాలు, ఫైట్ లు ఎక్కువగా ఉంటాయంటారు. ఇక మహారాజ్ శివాజీ చక్రవర్తి అంటే తనకెంతో గౌరవమని, అలాంటి ఛత్రపతి జీవిత కథ ఆధారంగా ఒక సినిమా కథ రాయాలని ఉందని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. 

click me!