పవన్ కళ్యాణ్ కోసం బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ

Published : May 12, 2017, 10:39 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
పవన్ కళ్యాణ్ కోసం బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ

సారాంశం

బాహుబలి సినిమా సక్సెస్ తో రచయిత విజయేంద్ర ప్రసాద్ కు యమా క్రేజ్ ప్రస్థుతం బాలీవుడ్ లో మణికర్ణిక సినిమాకు పని చేస్తున్న విజయేంద్ర ప్రసాద్ తదుపరి పవన్ కళ్యాణ్ సినిమాకు కథ అందిస్తానంటున్న విజయేంద్ర ప్రసాద్

బాహుబలి సినిమా భారతీయ సినిమాల రికార్డుల‌న్నింటినీ బ‌ద్దలుకొడుతూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్లు వసూలు చేసే దిశగా దూసుకెళ్తోంది. మరి ఈ చిత్రానికి క‌థ అందించిన రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం ఓ సినిమా క‌థ రాయాల‌నుకుంటున్నారు.

 

ప్ర‌స్తుతం ఆయ‌న బాలీవుడ్ లో ‘మణికర్ణిక’ సినిమాకి రచయితగా పనిచేస్తున్నారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం క‌థ రాసే అంశంపై స్పందించారు. ఆయ‌న‌ కోసం ఎందుకు రాయబోను? అని, తప్పకుండా రాస్తాన‌ని విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ అన్నారు. అతి తొందర్లోనే పవన్ క‌ల్యాణ్ తో కలసి పనిచేస్తానేమో? అని వ్యాఖ్యానించారు. రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన ఎన్నో సినిమాల‌కు క‌థ‌లు అందించిన ఆయ‌న‌.. ప‌వ‌న్ సినిమాకు కూడా క‌థ రాస్తాన‌న‌డంతో ప‌వ‌ర్ స్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

 

ఇప్పటికే బాహుబలి సినిమాలో ఇంటర్వెల్ సీన్ రాయటానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కారణమయ్యారని చెప్పిన విజయేంద్ర ప్రసాద్ తాజాగా పవన్ కళ్యాణ్ కోసం కథ రాసస్తానంటుండటంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. విజయేంద్ర ప్రసాద్ పవన్ కళ్యాణ్ కోసం ఏదో ఆసక్తికరమైన కథను మనసులో పెట్టుకునే ఇలా మాట్లాడడుతున్నారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలవుతుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు