ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో రానా పాత్ర ఏంటి..

Published : May 12, 2017, 10:18 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో రానా పాత్ర ఏంటి..

సారాంశం

బాహుబలి సినిమాలో భల్లాలదేవుని పాత్రతో రానాకు యమా క్రేజ్ బాహుబలి, ఘాజీ లాంటి భారీ హిట్స్ తో.. రానాకు పుల్ జోష్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో రానా ఉన్నాడా..

బాహుబలి సినిమాలో భల్లాలదేవుడిగా నటించిన రానా.. దానితో ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాడో తెలిసిందే. బాహుబలితోనే కాక రానా ఇటీవల ఘాజీ సినిమా సక్సెస్ తో మాంచి జోరు మీదున్నాడు. ప్రస్థుతం తేజ  దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటిస్తున్న రానా దాని తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించనున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో ఓ పాత్రలో నటించనున్నాడని ప్రచారం జోరందుకుంది.

 

ప్రస్థుతం బాహుబలి 2' సినిమా తెచ్చిన భారీ సక్సెస్ ను రానా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత రానా చేయనున్న ప్రాజెక్టుల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి 151వ సినిమా అయిన 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'లో రానా ఒక కీలకమైన పాత్రను పోషించే ఛాన్స్ ఉందనే టాక్ రెండు మూడు రోజులుగా వినిపిస్తోంది. రానాతో ఈ పాత్రను చేయించడానికి చరణ్ కూడా ఉత్సాహం చూపుతున్నాడని చెప్పుకున్నారు.

 

తాజాగా ఈ ప్రచారంపై రానా స్పందించాడు. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమాలో తాను నటించనున్నట్టు వస్తోన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని అన్నాడు. అసలు ఈ సినిమాకి సంబంధించి తనని ఇంతవరకూ ఎవరూ సంప్రదించలేదని చెప్పాడు. ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని చెప్పుకొచ్చాడు. దాంతో ఈ విషయం పై జోరుగా జరుగుతోన్న ప్రచారానికి తెరపడినట్లయింది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి