జయలలిత బయోపిక్: బాహుబలి రైటర్ స్ట్రాంగ్ ఎపిసోడ్స్!

Published : May 16, 2019, 06:01 PM IST
జయలలిత బయోపిక్: బాహుబలి రైటర్ స్ట్రాంగ్ ఎపిసోడ్స్!

సారాంశం

జయలలిత జీవిత ఆధారంగా ఇప్పుడు చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. నిత్యా మీనన్ - రమ్యకృష్ణ లతో పాటు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా జయ  బయోపిక్ కోసం సిద్ధమవుతోంది. అందరి చూపు ఇప్పుడు ఇదే సినిమాపై ఉంది. 

జయలలిత జీవిత ఆధారంగా ఇప్పుడు చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. నిత్యా మీనన్ - రమ్యకృష్ణ లతో పాటు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా జయ  బయోపిక్ కోసం సిద్ధమవుతోంది. అందరి చూపు ఇప్పుడు ఇదే సినిమాపై ఉంది. ఎందుకంటే ఈ సినిమాకు రచయితగా పనిచేస్తున్నది బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు. 

పైగా కంగనా రనౌత్ నటిస్తుండడంతో వివాదాలకు ఈ సినిమా ఏ మాత్రం అతీతం కాదు అనే టాక్ వినిపిస్తుంది. కోలీవుడ్ కూల్ డైరెక్టర్ ఏఎల్. విజయ్ ఈ బయోపిక్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే సినిమాలో ఇతర రాజకీయ నాయకులకు జయలలిత ఇచ్చిన కౌంటర్స్ యధావిధిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

జయలలిత తన చేతుల్లోకి పవర్ ను అందుకొని అధికారాన్ని ఎలా దక్కించుకున్నారని అంశాలను హైలెట్ చేస్తూ.. ఆమెకు ఎదురైనా చేదు అనుభవాలను సైతం స్క్రీన్ ప్లే లో యాడ్ చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. మెయిన్ గా ఓ వర్గం వారిని అప్పట్లో జయలలిత వణికించిన తీరును కూడా చుపిస్తారట. ఆ డోస్ ఎంత పెంచితే అంత మంచిదని కంగనా ఆదేశాలు జారీ చేసిందని సమాచారం.  అయితే ఇప్పుడు హై పొజిషన్స్ లో ఉన్న అప్పటి బాధితులు సినిమాను చూసి సైలెంట్ గా ఉంటారా? అనేది చర్చనీయాంశమవుతోంది.   

PREV
click me!

Recommended Stories

'అప్పుడు బిగ్ బాస్ చేసిన పనికి ఆశ్చర్యపోయా.. గిఫ్ట్‌గా లిప్‌స్టిక్‌లు పంపించాడు..'
Jana Nayakudu మూవీ `భగవంత్‌ కేసరి`కి కాపీనా, రీమేకా? అసలు నిజం చెప్పిన నిర్మాత.. ట్రోల్స్ కి ఫుల్‌ స్టాప్‌