RRR రషెష్ చూసి ఆగలేకపోయిన విజయేంద్ర ప్రసాద్.. వెంటనే సెట్స్ కి వెళ్లి..

pratap reddy   | Asianet News
Published : Aug 23, 2021, 03:37 PM IST
RRR రషెష్ చూసి ఆగలేకపోయిన విజయేంద్ర ప్రసాద్.. వెంటనే సెట్స్ కి వెళ్లి..

సారాంశం

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా చిత్రం రాబోతున్న ఈ మూవీ కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా చిత్రం రాబోతున్న ఈ మూవీ కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. బాహుబలి తర్వాత జక్కన్న ఎలాంటి మ్యాజిక్ చేస్తాడా అని అంతా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గానే ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. 

ఉక్రెయిన్ లో చివరి షెడ్యూల్ పూర్తి చేసుకుని చిత్ర యూనిట్ తిరిగి హైదరాబాద్ కు వచ్చింది. ఇదిలా ఉండగా ఈ చిత్ర రచయిత విజేంద్ర ప్రసాద్ తరచుగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆర్ఆర్ఆర్ విశేషాలు పంచుకుంటున్నారు. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ఆ మధ్యన ఓ సాంగ్ షూట్ జరుగుతున్నప్పుడు రషెష్ చూశాను. చాలా అద్భుతంగా అనిపించింది. వెంటనే సెట్స్ కు వెళ్లాలనిపించింది. అంతే చెప్పకుండా సెట్స్ కి వెళ్ళా. కారు దిగగానే చరణ్, తారక్ నాకు ఎదురు వచ్చారు. 

ఇద్దరూ సెట్స్ లో చాలా కలివిడిగా ఉంటారు. ఆర్ఆర్ఆర్ కంటే ముందు నుంచే వారి మధ్య స్నేహం ఉంది అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ చిత్ర రిలీజ్ మరోసారి వాయిదా పడుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై జక్కన్న త్వరలో మీడియా సమావేశం ద్వారా క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. 

అలియా భట్, ఒలీవియా మోరిస్ కథా నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సముద్ర ఖని, శ్రీయ శరన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ లో ఛాన్స్ ఇలా కూడా అడుగుతారా.. దుమారం రేపుతున్న నంద్యాల ఎస్ఐ సెల్ఫీ వీడియో
Anushka Shetty: కేవలం గ్లామర్, పాటల కోసమే నిన్ను తీసుకుంటున్నాం..అనుష్క శెట్టికి మైండ్ బ్లాక్ చేసిన రాజమౌళి