`మా` ఎన్నికల అప్‌డేట్‌ః మరో నెల ఆలస్యం?

By Aithagoni RajuFirst Published Aug 23, 2021, 3:26 PM IST
Highlights

ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు నరేష్‌ ఎన్నికల విషయంలో వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తుంది. పైగా ఆయనపై పలువురు ఆరోపణలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇది మరింతగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆదివారం `మా` అసోసియేషన్‌ క్రమశిక్షణా సంఘం(డీఆర్‌సీ) చైర్మెన్‌ కృష్ణంరాజు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం(ఏజీఎం) జరిగింది. ఈ సమావేశంలో `మా` ఎన్నికలు, సమస్యలు కీలక అంశాలపై చర్చలు జరిగినట్టు తెలుస్తుంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో `మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌`(మా) ఎన్నికలు హాట్‌ టాపిక్‌ అవుతుంది. కేవలం 900 మంది సభ్యులున్న ఈ అసోసియేషన్‌లో ఎన్నికల ఇష్యూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా సందర్భాల్లో ఇదే ప్రధాన టాపిక్‌గానూ మారుతుంది. అందుకు కారణం పెద్ద సెలబ్రిటీలుండటం. స్టార్స్ ఉండటంతో ఇందులో ఏం జరిగినా వైరల్‌ అవుతుంది. 

`మా` ఎన్నికల కాలపరిమితి పూర్తయి నాలుగు నెలలవుతుంది. దీంతో ఎన్నికలు నిర్వహించాలని `మా` సభ్యులు, పోటీలో ఉన్న వారు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్‌ నర్సింహారావు అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు నరేష్‌ ఎన్నికల విషయంలో వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తుంది. పైగా ఆయనపై పలువురు ఆరోపణలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇది మరింతగా చర్చనీయాంశంగా మారింది. 

తాజాగా ఆదివారం `మా` అసోసియేషన్‌ క్రమశిక్షణా సంఘం(డీఆర్‌సీ) చైర్మెన్‌ కృష్ణంరాజు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం(ఏజీఎం) జరిగింది. ఈ సమావేశంలో `మా` ఎన్నికలు, సమస్యలు కీలక అంశాలపై చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న ప్రకాశ్‌రాజ్‌ వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని డీఆర్‌సీని కోరారు.  జీవిత కూడా వచ్చే నెల 12 లేదా 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు తేదీల్లో ఎన్నికలు నిర్వహించడం కష్టమని తెలుస్తోంది.

`మా` బైలాస్‌ ప్రకారం ఏజీఎం జరిగిన 21 రోజుల్లో ఎన్నికలు నిర్వహించవచ్చు. కొవిడ్‌ నిబంధనల దృష్య్టా పరిస్థితుల అనుకూలతను బట్టి ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే మరో వారం సమయం తీసుకుని ఎన్నికల తేదీ వెల్లడిస్తామని డీఆర్‌సీ తెలిపింది. వచ్చే నెల 12 కాకుండా 19వ తేదీన కూడా ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే అదే సమయంలో వినాయక నిమజ్జనం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అనుమతి దొరక్క పోవచ్చు. 

దీంతో `మా` ఎన్నికలు మరో నెల రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం. అందులో భాగంగానే అక్టోబర్‌ 10న ఎన్నికలు నిర్వహించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అది రెండో ఆదివారం కావడం, సినిమా పరిశ్రమకు సెలవు కావడంతో సభ్యులు, అసోసియేషన్‌ మెంబర్స్‌ అందుబాటులో ఉంటారని, అదే రోజు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. అయితే ఎన్నికలపై సభ్యుల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయని టాక్‌. 

click me!