అఫీషియల్: పాన్ ఇండియా మూవీగా సీఎం జగన్ బయోపిక్... హీరో ఎవరంటే?

Published : Jul 02, 2021, 10:55 AM ISTUpdated : Jul 02, 2021, 10:57 AM IST
అఫీషియల్: పాన్ ఇండియా మూవీగా సీఎం జగన్ బయోపిక్... హీరో ఎవరంటే?

సారాంశం

యాత్ర మూవీతో దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని తెరపై ఆవిష్కరించిన దర్శకుడు మహి రాఘవ వై ఎస్ జగన్ బయోపిక్ కూడా తెరకెక్కించనున్నారు.

టాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. యాత్ర మూవీతో దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని తెరపై ఆవిష్కరించిన దర్శకుడు మహి రాఘవ వై ఎస్ జగన్ బయోపిక్ కూడా తెరకెక్కించనున్నారు. ఇక ఈ చిత్రంలో సీఎం జగన్ గా 'స్కామ్ 1992' ఫేమ్ ప్రతీక్ గాంధీని ఎంచుకోవడం జరిగింది. 


ప్రతీక్ కి స్క్రిప్ట్ నేరేట్ చేయగా ఆయన చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యారట. మరో విశేషం ఏమిటంటే ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కనుంది. ప్రతీక్ గాంధీని ఎంపిక చేయడం వెనుక కారణం కూడా అదే అని తెలుస్తుంది. తండ్రి రాజశేఖర్ రెడ్డి మాదిరి ప్రజా నాయకుడిగా సీఎం జగన్ ఎలా ఎదిగాడు అనేది ఈ మూవీలో ప్రధానాంశంగా చూపిస్తారట.

 రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులు, అధిష్టానాన్ని ఎదిరించి జగన్ పార్టీ పెట్టడం, జైలుపాలు కావడంతో పాటు, సీఎంగా పీఠం అధిరోహించిన తీరు ఎమోషనల్ గా చెప్పనున్నారని వినికిడి. 
వై ఎస్ జగన్ బయోపిక్ ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలో మొదలుకానున్నాయట. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ఈ బయోపిక్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెడతారట. 

ఇక యాత్ర మూవీతో మహి రాఘవ మంచి మార్కులు రాబట్టారు. అంతకు మించి వై ఎస్ జగన్ బయోపిక్ మహి తెరకేక్కిన్చాన్నట్లు తెలుస్తుంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌