నేను విలన్ ఏంటి..? మహేష్ సినిమాపై విజయశాంతి కామెంట్స్!

Published : Jun 24, 2019, 04:06 PM ISTUpdated : Jun 24, 2019, 04:11 PM IST
నేను విలన్ ఏంటి..? మహేష్ సినిమాపై విజయశాంతి కామెంట్స్!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఒకప్పటి హీరోయిన్ విజయశాంతి ముఖ్య పాత్ర పోషిస్తుండడం విశేషం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఒకప్పటి హీరోయిన్ విజయశాంతి ముఖ్య పాత్ర పోషిస్తుండడం విశేషం. ఎన్నో ఏళ్ల క్రితం మహేష్ కి తల్లిగా నటించింది విజయశాంతి.

మళ్లీ ఇంతకాలానికి అతడితో కలిసి నటిస్తుండడంతో ఈ కాంబినేషన్ పై ఆసక్తి పెరిగిపోతోంది. ఈ సినిమాలో ఆమె నటిస్తుందనే విషయంపై స్పష్టత వచ్చినప్పటికీ ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంపై క్లారిటీ లేదు. ఆమె విలన్ రోల్ లో కనిపించబోతుందంటూ ప్రచారం జరిగింది. 

ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావిస్తే.. ఆశ్చర్యపడ్డారు. నేను విలన్ ఏంటి..? అంటూ షాకయ్యారు. తను పాజిటివ్ పర్సన్ అని.. తెర మీద కూడా నెగెటివ్ గా కనిపించడానికి ఇష్టపడనని స్పష్టం చేశారు. ఈ సినిమాలో  కాదు.. మరెప్పుడు కూడా తను విలన్ పాత్రలు చేయనని తేల్చి చెప్పారు. 

మహేష్ సినిమాలో తన పాత్రలో ఎలాంటి నెగెటివ్ షేడ్స్ ఉండవని.. మహేష్ కి తల్లిగా కూడా కనిపించడం లేదని అన్నారు. ఈ సినిమాలో తనకు మహేష్ తో ఎలాంటి రిలేషన్ ఉండదని.. ఇద్దరి పాత్రలు సమాంతరంగా సాగుతాయని చెప్పారు.

దాదాపు పడుమూడేళ్ళ తరువాత ఎంట్రీ ఇస్తుండడంతో.. వరుసగా సినిమాలు చేస్తారా..? అని ప్రశ్నించగా.. పాత్రల మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు.  

PREV
click me!

Recommended Stories

కాసుల వర్షం కురిపిస్తున్న రాజా సాబ్, ప్రభాస్ సినిమా 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
కెమెరాల ముందు ప్రియాంక, నిక్ రొమాన్స్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో స్టార్ కపుల్ సందడి