తెరపైకి కృష్ణవంశీ 'రుద్రాక్ష'!

Published : Jun 24, 2019, 03:45 PM IST
తెరపైకి కృష్ణవంశీ 'రుద్రాక్ష'!

సారాంశం

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తన కెరీర్ లో ఎన్నో హిట్టు సినిమాలు చేశాడు. 

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తన కెరీర్ లో ఎన్నో హిట్టు సినిమాలు చేశాడు. కానీ ఈ మధ్యకాలంలో ఆయనకి సరైన సక్సెస్ రాలేదు. 'నక్షత్రం' సినిమా ఫ్లాప్ కావడంతో మళ్లీ మెగాఫోన్ పట్టలేదు కృష్ణవంశీ. ఇంతకాలం సమయంలో తీసుకొని కథ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకి నిర్మాతగా బండ్ల గణేష్ వ్యవహరించనున్నారు. గతంలో కృష్ణవంశీ-బండ్ల గణేష్ కాంబినేషన్ లో 'గోవిందుడు అందరివాడేలే' సినిమా తెరకెక్కింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి వర్క్ చేయబోతున్నారు. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

'నక్షత్రం' కంటే ముందు కృష్ణవంశీ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలనుకున్నాడు. 'రుద్రాక్ష' అనే టైటిల్ కూడా బయటకి వచ్చింది. ఇప్పుడు అదే కథను కాస్త మార్చి తెరపైకి తీసుకొస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో కథానాయికగా ఓ అగ్ర హీరోయిన్ కనిపించనుంది.

డేట్లు ఫైనల్ అయిన తరువాత హీరోయిన్ తో సహా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాపై కృష్ణవంశీ చాలా ఆశలు పెట్టుకున్నాడు. నిర్మాత దిల్ రాజు కథ విని బాగుందని చెప్పడంతో మరింత కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి
Nayanam Review:తండ్రి వయసు వ్యక్తితో పెళ్లి, భర్తను చింపేసిన భార్య వరుణ్ సందేశ్ ‘నయనం’ ఎలా ఉంది?