#Vijay: ఊహించని రేటుకి `వారసుడు`ఓటీటీ రైట్స్.. ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే!

By Aithagoni RajuFirst Published Sep 12, 2022, 6:47 AM IST
Highlights

దళపతి విజయ్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న `వారసుడు` చిత్రం ఓటీటీ రైట్స్ అమ్ముడు పోయాయి. ఊహించని రేటుకి ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ దక్కించుకోవడం విశేషం.

దళపతి విజయ్‌(Vijay) నటిస్తున్న తెలుగు, తమిళం బైలింగ్వల్‌ చిత్రం `వారసుడు`(Vaarasudu). తమిళంలో ఇది `వరిసు`(Varisu)గా తెరకెక్కుతుంది. తెలుగు డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఇందులో కథానాయికగా నటిస్తుంది. ఆల్మోస్ట్ పాన్‌ ఇండియా స్థాయిలో ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. విజయ్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. 

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్(Vaarasudu Ott Rights) అమ్ముడు పోయినట్టు తెలుస్తుంది. భారీ మొత్తానికి అమెజాన్‌ ప్రైమ్‌ దక్కించుకున్నట్టు సమాచారం. ఓటీటీ రైట్స్ ని అమెజాన్‌ ఏకంగా 60కోట్లకు దక్కించుకుందని సమాచారం. మరోవైపు శాటిలైట్‌ రైట్స్ కూడా షాకిచ్చేలా పలికిందట. సన్‌ టీవీ ఏకంగా యాభై కోట్లు వెచ్చించిందని సమాచారం. అలాగే మ్యూజికల్‌ రైట్స్‌ ని టీ సిరీస్‌ పది కోట్లకి కొనుక్కుందని సమాచారం. ఇలా నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ ద్వారానే ఈ సినిమాకి ఏకంగా రూ.110కోట్లు వచ్చినట్టు సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇదే నిజమైతే సినిమా విడుదలకు ముందే నిర్మాత సేఫ్‌ అని, ఇక థియేటర్ ద్వారా వచ్చేదే బోనస్‌ అని చెప్పొచ్చు. ఇది దళపతి విజయ్‌ క్రేజ్‌కి, మార్కెట్‌కి నిదర్శనమని అంటున్నారు అభిమానులు. ప్రస్తుతంఈ వార్త సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌ గా మారడం విశేషం. విజయ్‌ చివరగా `బీస్ట్` చిత్రంలో నటించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రం డిజప్పాయింట్‌ చేసింది. కలెక్షన్ల పరంగా బాగానే వసూళ్లు చేసినట్టు సమాచారం. 

నెక్ట్స్ `విక్రమ్‌`, `మాస్టర్‌` ఫేమ్‌ లోకేష్‌ కనగరాజ్‌తో సినిమా చేస్తున్నారు విజయ్‌. ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. వీరి కాంబినేషన్‌లో వచ్చిన `మాస్టర్‌` మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు రూపొందించే సినిమా `విక్రమ్‌`ని మించి ఉండబోతుందని సమాచారం. కమల్‌ హాసన్‌ హీరోగా లోకేష్‌ రూపొందించిన `విక్రమ్‌` ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఏకంగా ఇది 450కోట్లు వసూలు చేసిందని ట్రేడ్‌ వర్గాల టాక్‌. దీంతో విజయ్‌-లోకేష్‌ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 

click me!