మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఇంట తీవ్ర విషాదం.. కృష్ణంరాజు మరణవార్తను మరవక ముందే మరో విషాద ఘటన..

Published : Sep 11, 2022, 05:58 PM IST
మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఇంట తీవ్ర విషాదం..  కృష్ణంరాజు మరణవార్తను మరవక ముందే మరో విషాద ఘటన..

సారాంశం

టాలీవుడ్ లో వరుస విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణవార్తతో సినీలోకం చింతిస్తుండగా.. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట త్రీవ విషాదం నెలకొంది.  

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వరుస విషాలు నెలకొనడం సినీ లోకాన్ని కలిచివేస్తోంది. ఈ రోజు ఉదమయే టాలీవుడ్ సీనియర్ నటుడు, లెజెండరీ యాక్టర్, రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam) తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్తతో సినీ లోకమంతా శోకసంద్రంతో నిండిపోయింది. స్టార్స్ అంతా మంచి వ్యక్తిని  కోల్పోయినందుకు చింతిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సంగీ దర్శకుడు మణిశర్మ (Mani Sharma) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

మణిశర్మ తల్లి యనమండ్ర సరస్వతి దేవి (88) కూడా ఈ రోజే ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. తాజాగా అందిన సమాచారం ప్రకారం..  మచిలీపట్నానికి చెందిన సరస్వతి దేవి అనారోగ్యం, వయసు రీత్యా ఆరోగ్యం క్షీణించి కన్నుమూసింది. దీంతో మణిశర్మ కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆయనకు, ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఘటన తర్వాత మరోఘటన జరుగుతుండటంతో సినీ ఇండస్ట్రీలో ఆందోళనకర పరిస్థితులు అలుముకున్నాయి.

కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉన్న మణిశర్మ ఇప్పుడిప్పుడే మళ్లీ జోరుపెంచుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఇంట విషాద ఘటన జరగడం అందరినీ కలిచివేస్తోంది. చివరిగా ‘ఆచార్య చిత్రానకి’ సంగీతం అందించారు. ప్రస్తుతం ‘యశోద’,‘శాకుంతలం’,‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’,‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు