రీ రిలీజ్ కానున్న ప్రభాస్ యాక్షన్ ఫిల్మ్ ‘రెబల్’.. ఎప్పుడంటే?

Published : Oct 08, 2022, 05:41 PM IST
రీ రిలీజ్ కానున్న ప్రభాస్ యాక్షన్ ఫిల్మ్ ‘రెబల్’.. ఎప్పుడంటే?

సారాంశం

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. డార్లింగ్ నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘రెబల్’ రీ రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రెబల్ స్టార్, దివంగత కృష్ణం రాజు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కలిసి నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘రెబల్’ (Rebel) మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతోంది. స్టార్ హీరోల పుట్టిన రోజులకు వారు గతంలో నటించిన సూపర్ హిట్ చిత్రాలను, అభిమానులకు బాగా నచ్చిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజున ‘పోకిరి’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున ‘జల్సా’ రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తరువాతి వరుసలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డేనే ఉండటంతో అభిమానులు సెలబ్రేషన్స్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. 

అక్టోబర్ 23న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు ఉంది. ఈ సందర్భంగా అభిమానులు ప్రభాస్ నటించిన మాస్ అండ్ యాక్షన్ ఫిల్మ్  ‘రెబల్’ను రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2012లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా అలరించిన విషయం తెలిసిందే. అదే ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు (Krishnam Raju) కూడా నటించారు. డార్లింగ్ కు ప్రీ బర్త్ డే ట్రీట్ గా అభిమానులు  ‘రెబల్’ మూవీని అక్టోబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా వారమే సమయం ఉండటంతో చిత్రం విడుదలకు ఏర్పాట్లను చేస్తున్నారు. మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ధీటుగా డార్లింగ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను చేయనున్నారు.

రెబల్ స్టార్ కృష్ణం రాజు గత నెల సెప్టెంబర్ 11న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్త తెలుసుకున్న రాఘవా లారెన్స్ (Raghava Lawrence) ఎంతగానో దిగ్భ్రాంతికి గురైన విషయం తెలిసిందే. కడసారిగా కూడా చూడకపోవడంతో చాలా బాధపడ్డారు. ఈక్రమంలో లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్, కృష్ణం రాజు కలిసి నటించిన చిత్రం ‘రెబల్’ రీరిలీజ్ కాబోతుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ చిత్రాల షూటింగ్ లో ఉన్నారు. అలాగే ‘ఆదిపురుష్’ ప్రమోషన్స్ లోనూ పాల్గొంటూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..
10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?