డబుల్ ట్రీట్.. ‘లియో’లో విజయ్ ద్విపాత్రాభినయం.. ఎలాంటి పాత్రల్లో అంటే?

By Asianet News  |  First Published May 15, 2023, 1:08 PM IST

తమిళ స్టార్ విజయ్ దళపతి - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘లియో’. చిత్రం నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అదిరిపోయే న్యూస్ అందింది.
 


‘మాస్టర్’ చిత్రం తర్వాత తమిళ స్టార్ విజయ్ దళపతి (Vijay Thalapathy) - క్రియేటివ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్ లో వస్తున్న చిత్రం Leo. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం షూటింగ్ చెన్నైలో జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే పలు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్నారు. మరోవైపు హైదరాబాద్ లోనూ ఓ షెడ్యూల్ కు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. స్పీడ్ గా చిత్రీకరణ జరుగుతుండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతోంది.

ఈ క్రమంలో ‘లియో’ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందుతూనే ఉన్నాయి. తాజా న్యూస్ ప్రకారం.. ఈచిత్రంతో దళపతి ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ అందనున్నట్టు తెలుస్తోంది. విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని అంటున్నారు. రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారని అంటున్నారు. ఒకటి గ్యాంగ్ స్టర్ పాత్రలో యాక్షన్ ఇరగదీయబోతుండటంతో పాటు చాక్లెట్ తయారు చేసి వ్యక్తి పాత్రలోనూ కనిపించబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్ కూడా అలానే కనిపిస్తోంది.  

Latest Videos

గతంలో విజయ్ దళపతి ‘బిజిల్’ చిత్రంలో డ్యూయెల్ రోల్ లో అలరించారు. తండ్రిగా, కొడుకుగా రెండు పాత్రల్లో మెప్పించారు. మళ్లీ ఇప్పడు ‘లియో’లో రెండు భిన్నమైన రోల్స్ లో కనిపించబోతున్నారని అంటున్నారు. దీంతో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. ఇక షూటింగ్ విషయానికొస్తే ప్రస్తుం క్లైమాక్స్ వరకు షూటింగ్ వచ్చిందంటున్నారు. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. 

14 ఏళ్ల తర్వాత విజయ్ దళపతి - త్రిష జంటగా నటిస్తుండటం విశేషం. ‘మాస్టర్’, ‘ఖైదీ’, ‘విక్రమ్’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను అందించిన లోకేష్ కనగరాజ్ ‘లియో’పై మరింతగా అంచనాలు పెంచేస్తున్నారు. చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో  సంజయ్ దత్ , గౌతమ్ మీనన్ ,మిస్కిన్ , మన్సూర్ అలీఖాన్ , ప్రియా ఆనంద్ లాంటిస్టార్స్  ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 19న దసరా కానుకగా చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

 

click me!