ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్.. అగ్గి పిడుగులాంటి పిడి గుద్దులు, రామ్ బోయపాటి టీజర్ అదుర్స్

Published : May 15, 2023, 12:01 PM IST
ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్.. అగ్గి పిడుగులాంటి పిడి గుద్దులు, రామ్ బోయపాటి టీజర్ అదుర్స్

సారాంశం

అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను.. ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో తమన్ సంగీత దర్శకుడిగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను.. ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో తమన్ సంగీత దర్శకుడిగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కెరీర్ లో తొలిసారి రామ్ ఈ చిత్రం కోసం స్టయిలిష్ లుక్ పక్కన పెట్టాడు. 

బాగా బొద్దుగా మారి రగ్గడ్ లుక్ లో ఊరమాస్ గెటప్ లో దర్శనం ఇస్తున్నాడు. దీనితో బోయపాటి మాస్ కథకి, రామ్ ఎనెర్జిటిక్ పెర్ఫామెన్స్ తోడైతే సిల్వర్ స్క్రీన్ పగిలిపోయే చిత్రం గ్యారెంటీ అని ఫ్యాన్స్ అంచనాలతో ఉన్నారు. నేడు రామ్ పోతినేని తన 35వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. 

దీనితో రామ్ బర్త్ డే కానుకగా బోయపాటి చిత్రం నుంచి ఫస్ట్ థండర్ పేరుతో టీజర్ రిలీజ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే విడుదలైన టీజర్ అదిరిపోయింది. దున్నపోతుని పట్టుకుని రామ్ ఇస్తున్న ఎంట్రీ మాస్ ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ లాగా ఉంది. 

'నీ స్టేటు దాటలేనన్నావ్ దాటా .. నీ గేటు దాటలేనన్నావ్ దాటా, నీ పవర్ దాటలేనన్నావ్ దాటా.. ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్సు' అంటూ రీ సౌండ్ వచ్చేలా రామ్ చెబుతున్న డైలాగ్ ఉరుము ఉరిమినట్లుగానే ఉంది. బోయపాటి మార్క్ యాక్షన్ బ్లాక్స్ టీజర్ లో కనిపిస్తున్నాయి. రామ్ శత్రువులని పిడిగుద్దులు గుద్దుతూ వెంటాడుతున్నాడు. 

ఇంకా టైటిల్ కూడా ఖరారు కాకముందే ఈ టీజర్ తో సినిమాపై కావలసినంత హైప్ వచ్చేసింది అని చెప్పొచ్చు. తమన్ ఎప్పటిలాగే మాస్ బిజియంతో మోతెక్కించారు. ఓవరాల్ గా బోయపాటి రామ్ బర్త్ డేకి సాలిడ్ గిఫ్ట్ ఇచ్చారనే చెప్పాలి. ఈ చిత్రంలో రామ్ కి జోడిగా శ్రీలీల నటిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌