
ఓటీటీ హవా మొదలయ్యాక ప్రేక్షకులు థియేటర్స్ కి రావడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. భిన్నమైన కంటెంట్ కలిగి అద్భుతమైన టాక్ వచ్చిన చిత్రాలను మాత్రమే ప్రేక్షకులు థియేటర్లో చూస్తున్నారు. బ్యాడ్ టాక్ వస్తే ఓటీటీలో చూద్దాంలే అని లైట్ తీసుకుంటున్నారు. దీంతో ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించేందుకు మేకర్స్ నానా పాట్లు పడుతున్నారు. వాటిలో టికెట్స్ ధరలు తగ్గించడం ఒకటి.
కలెక్షన్స్ నెమ్మదించిన తరుణంలో టికెట్స్ ధరలు యాభై శాతానికి పైగా తగ్గిస్తున్నారు. ఈ మధ్య కాలంలో బ్రహ్మాస్త్ర, పఠాన్, జర హట్కే జర బచ్కే వంటి చిత్రాలు ఇదే విధంగా టికెట్స్ ధరలు తగ్గించారు. షారుక్ ఖాన్ పఠాన్ మూవీతో కమ్ బ్యాక్ అయ్యాడు. ఐదు వందలకు పైగా కోట్లు ఈ చిత్రం రాబట్టింది. అయితే 25 రోజుల తర్వాత మరిన్ని కలెక్షన్స్ రాబట్టేందుకు రూ. 110 గా టికెట్ ధర నిర్ణయించారు.
ఇక బ్రహ్మాస్త్ర టికెట్ ధర కేవలం రూ. 100 రూపాలకే దసరా నవరాత్రి రోజుల్లో ఇచ్చారు. ఇక జర హట్కే జర బచ్కే టీమ్ మొదటి రోజు నుండే ఒక టికెట్ కొంటే మరొక టికెట్ ఉచితం ఆఫర్ పెట్టింది. ఈ టెక్నిక్స్ బాగానే వర్క్ అవుట్ అయ్యాయి. దాంతో ఆదిపురుష్ టీమ్ ఫాలో అవుతుంది. పీవీఆర్, ఐనాక్స్, సినీపోల్స్ థియేటర్స్ చైన్స్ లో ఆదిపురుష్ త్రీడీ టికెట్ ధర కేవలం రూ. 150 గా నిర్ణయించారు. టికెట్ ధరల తగ్గింపు ఆదిపురుష్ కలెక్షన్స్ పెంచుతుందని యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిపురుష్ మూవీ ఓపెనింగ్స్ పరంగా సత్తా చాటింది. వీక్ డేస్ మొదలు కాగానే బాక్సాఫీస్ వద్ద వీకైపోయింది. ఈ క్రమంలో టికెట్స్ ధరలు తగ్గించాలని నిర్ణయించుకున్నారు. దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రభాస్ రాఘవుడిగా, కృతి సనన్ జానకిగా నటించారు. రావణాసురుడు పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. రామాయణగాథగా ఆదిపురుష్ తెరకెక్కింది..