
ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించడంతో.. చరణ్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. తనకు పాప పుట్టడంతో కొన్ని రోజులు షూటింగ్ కు బ్రేక్ తీసుకున్న చరణ్ తిరిగి సెట్ లో చేరారు. ప్రస్తుతం హీరో, హీరోయిన్ తో పాటు కీలక పాత్రధారులు షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ప్రస్తుతం రామ్‌చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్‌చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ దాదాపు అయిపోవచ్చింది. చరణ్ ఈనెలలో దాదాపు ఈమూవీ పెండింగ్ షూటింగ్ ను కంప్లీట్ చేయాలని చూస్తున్నాట. అటు చరణ్ ఇచ్చిన గ్యాప్ ను ఉపయోగించుకుని శంకర్ ఇప్పటికే కమల్ హాసన్ తో ఇండియాన్2 మూవీని పరుగులు పెట్టించాడు. ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక చరణ్ సినిమాను సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని చూస్తున్నాడట శంకర్.
ఇక శంకర్ రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా కూడా చివరిదశలో ఉంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ప్యాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ సినిమాకు చరణ్ ఓకే చెప్పాడు. గేమ్ చేంజర్ అయిపోగానే.. అదే ఊపుతో.. ఏమాత్రం గ్యాప్ లేకుండా.. బుచ్చిబాబుతో చేయబోయే సినిమాపై ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నాడు రామ్ చరణ్. ఇక ఇప్పటికే బుచ్చిబాబు.. ఈసినిమాకు కావల్సి పనులు చేసుకుంటున్నాడు. తమ సినిమాకు మ్యూజిక్ చేయాల్సిందిగా రెహమాన్ ను బుచ్చిబాబు ఒప్పించాడట. ఈ పనిమీద చెన్నై వెళ్ళిన బుచ్చి.. పనిలో పనిగా.. రామ్ చరణ్ కు విలన్ ను కూడా సెట్ చేసినట్టు తెలుస్తోంది.
రామ్ చరణ్ కు విలన్ గా ఆర్ సి 16 లో ...కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ పాత్ర చేయాల్సిందిగా బుచ్చిబాబు అడిగారట. విజయ్ ఆల్ రెడీ బుచ్చిబాబు డైరెక్షన్ ఉప్పెన సినిమాలో నటించారు. ఉప్పెనలో హీరోయిన్ తండ్రిగా విజయ్ కనిపించారు. ఇక చరణ్ సినిమాలో మరో పవర్ ఫుల్ విలన్‌గా కనిపించనున్నాడట. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. మైత్రీ మూవీ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రూపొందుతుంది. మరి ఈ విషయం ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. త్వరలో చేయబోతున్నట్టు తెలుస్తోంది.