ప్రభాస్ కు విలన్ గా విజయ్ సేతుపతి?

By Surya Prakash  |  First Published Jan 21, 2021, 10:07 PM IST


విభిన్న పాత్రలు పోషిస్తూ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు విజయ్‌ సేతుపతి. ఆయనకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్‌ సేతుపతి సినిమా అంటే బాక్సాఫీస్‌ బద్దలవ్వాల్సిందే. ఆ విషయం తాజాగా విజయ్‌ నటించిన 'మాస్టర్'‌ సినిమాపై కూడా అంచనాలు అదే రేంజ్‌లో క్రియేట్ అవటంలోనే అర్దమైంది. ఆ సినిమాలో విజయ్ సేతుపతి ..హీరోతో సమానమైన విలన్ పాత్రను పోషించారు. ఆయన పాత్రకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. 


ఈ నేపధ్యంలో విజయ్ సేతుపతి,ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నిర్మాతలకు కలిగిందిట. ఆ నిర్మాతలు ఎవరూ అంటారా సలార్ ప్రొడ్యూసర్స్. తమిళంలోనూ అప్పుడు ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని భావించి ఈ డెసిషన్ తీసుకున్నారట. అయితే విజయ్ సేతపతి డేట్స్ దగ్గరే లాక్ అవ్వలేదట. చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఒకటి రెండు వారాల్లో ఏ విషయం ఫైనలైజ్ కానుంది. విజయ్ సేతుపతి కనుక సైన్ చేస్తే ప్రాజెక్టుకు పిచ్చ క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. 

మరో ప్రక్క ప్రభాస్‌ ‘సలార్‌’ మొదలై...ఫ్యాన్స్ కు పండగ చేసింది. ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ కు ఇది నెక్ట్స్ లెవిల్ ఫిల్మ్‌. ‘కె.జి.ఎఫ్‌’తో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, నిర్మాత విజయ్‌ కిరంగందూర్‌ జాతీయ స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఈ ముగ్గురి  కలయికలో రూపొందనున్న మరో పాన్‌ ఇండియా చిత్రమే... ‘సలార్‌’.  ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానుంది. అలాగే ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చెయ్యాలనేది దర్శక,నిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది. 

Latest Videos

దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడుతూ ‘‘నాకు అవకాశం ఇచ్చిన హోంబలే ఫిలింస్‌  అధినేత విజయ్‌ కిరగందూర్‌కీ, ప్రభాస్‌కీ ధన్యవాదాలు.  ‘సలార్‌’ ప్రేక్షకుల్ని నిరాశ పరచదు’’ అన్నారు.
 
 “కేజీఎఫ్” చిత్రాలకు తనతో వర్క్ చేసిన టెక్నీషియన్లనే ఆయన ప్రభాస్ సినిమాకి కూడా రిపీట్ చేస్తున్నాడు. “కేజీఎఫ్” సినిమాకి టెర్రిఫిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన రవి బస్రుర్ కే ప్రభాస్ సినిమాకి బాధ్యతలు అప్పగించాడు ప్రశాంత్ నీల్.   ఇప్పటికే సినిమాకి సంబందించిన మ్యూజిక్ వర్క్ మొదలుపెట్టేసారట. అలాగే ఈ సినిమాకి కెమెరా మేన్ కూడా “కేజీఎఫ్”కి వర్క్ చేసిన భువన్ గౌడ పని చేయనున్నాడు. హీరోయిన్, ఇతర నటులు తప్ప… మిగతా టీం అంతా ప్రశాంత్ నీల్ తో తొలినుంచి పనిచేస్తున్నవారే ఉంటారని చెప్తున్నారు.

 ఇక ఈ సినిమా టైటిల్ అర్ధం దర్శకుడు నీల్ రివీల్ చేసారు. సలార్ అంటే ఒక రాజుకు రైట్ హ్యాండ్ అని చెప్పాడు. ‘మోస్ట్‌ వయోలెంట్‌ మ్యాన్‌.. కాల్డ్‌ వన్‌ మ్యాన్‌... ది మోస్ట్‌ వయోలెంట్‌.. సినిమా మీద ప్రేమతో భాషల హద్దులను చెరిపేస్తూ.. భారతీయ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం.. ప్రభాస్‌ గారికి హృదయపూర్వక స్వాగతం’ అంటూ ప్రశాంత్ నీల్ పోస్టులో పేర్కొన్నారు.  హొంబెల్‌ ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. కేజీఎఫ్‌,  కేజీఎఫ్‌ 2ను నిర్మించిన విజయ్‌ కిరుగందుర్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ వెనుక ఉన్న హోంబాలే చిత్రాలు ఈ చిత్రాన్ని బ్యాంక్రోలింగ్ చేస్తున్నాయి.
  

click me!