ఆ నిజ జీవిత సంఘటన ఆధారంగానే ‘బంగారు బుల్లోడు’

By Surya PrakashFirst Published Jan 21, 2021, 10:01 PM IST
Highlights

అల్లరి నరేష్‌, పూజా జవేరి జంటగా నటించిన చిత్రం ‘బంగారు బుల్లోడు’. గిరి పాలిక దర్శకుడు. సుంకర రామబ్రహ్మం నిర్మాత. జనవరి 23న థియేటర్లలో విడుదలవుతోంది. అల్లరి నరేష్‌ గ్రామీణ బ్యాంక్‌ ఉద్యోగిగా బంగారం తాకట్టు పెట్టుకొని అందరికీ రుణాలిస్తుంటాడు .కస్టమర్లు కుదవ పెట్టిన బంగారాన్ని తన అవసరాలకు వాడుకుంటూ ఉండి సమస్యల్లో ఇరుక్కుంటాడు. ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే రిలీజయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. 

అల్లరి నరేష్‌ మాట్లాడుతూ..  మా ‘బంగారు బుల్లోడు’ సినిమా జనవరి 23న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. ఈ సీజన్‌లో ఫస్ట్ కామెడీ ఫిల్మ్ ఇది. నా సినిమాల్లో కామెడీ ఉంటుంది కానీ.. కథ తక్కువగా ఉంటుందని కంప్లైంట్ ఉంది. అందుకే ఈ సినిమా ద్వారా కథలో కామెడీ చూపించబోతున్నాం. కామెడీ కోసం కథ చేయకూడదని అనుకున్నాం. అలా ‘బంగారు బుల్లోడు’ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది.

ఇక ఈ చిత్రం కథ ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందింది. రాజమండ్రిలోని ఓ బ్యాంక్ మేనజర్ ఓ గోల్డ్ స్కామ్ లో ఇరుక్కున్నారు. దాన్ని బేస్ చేసుకుని ఈ కథ ని దర్శకుడు గిరి రూపొందించారు. 
 
అలాగే ఈ సినిమాకి బంగారు బుల్లోడు అని టైటిల్ ఎందుకు పెట్టాం అంటే.. చాలామందిలో అనుమానం ఉంది. ఇది బాలక్రిష్ణ గారి సినిమా కదా అని అన్నారు. ఆయనకి ఈ సినిమాకి ఏ రిఫరెన్స్ లేదు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ గోల్డ్ స్మిత్. గ్రామీణ బ్యాంక్‌లో బంగారంపై వడ్డీకి డబ్బులు ఇచ్చే ఉద్యోగి. సినిమా మొత్తం బంగారం మీదే ఉంటుంది కాబట్టి.. టైటిల్ బంగారంపై ఉంటే బాగుంటుదని ‘బంగారు బుల్లోడు’ అని టైటిల్ పెట్టాం అని నరేష్ చెప్పారు. 
 
 ఈ టైటిల్ అడగ్గానే ఇచ్చిన బాలయ్య గారికి.. దర్శకుడు రవిరాజా పినిశెట్టికి.. చిత్ర నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాలో స్వాతిలో ముత్యమంత సినిమాని రీమిక్స్ చేశాం. అది క్లాసిక్ హిట్ సాంగ్.. ఆ సాంగ్‌ రేంజ్‌లో చేయకపోయినా.. ఆ సాంగ్‌ని చెడగొట్టకూడదని సాయి కార్తీక్ ఈ పాటకి న్యాయం చేశాడు. ఈ సందర్భంగా ఆడియన్స్‌కి నా రిక్వెస్ట్ ఏంటి అంటే.. థియేటర్స్‌కి రావడానికి చాలామంది బయటపడుతున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ థియేటర్స్‌కి రావాలని కోరుతున్నా’ అంటూ ప్రేక్షకుల్ని రిక్వెస్ట్ చేశారు అల్లరి నరేష్.

click me!