ముఖ్యమంత్రిని పొగిడి వివాదంలో ఇరుక్కున్న స్టార్ హీరో!

Published : Feb 05, 2019, 04:53 PM IST
ముఖ్యమంత్రిని పొగిడి వివాదంలో ఇరుక్కున్న స్టార్ హీరో!

సారాంశం

తమిళనాట చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టి స్టార్ హీరో హోదా దక్కించుకున్నాడు విజయ్ సేతుపతి. కోలివుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఆయనకి అభిమానులు ఉన్నారు. 

తమిళనాట చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టి స్టార్ హీరో హోదా దక్కించుకున్నాడు విజయ్ సేతుపతి. కోలివుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఆయనకి అభిమానులు ఉన్నారు. దక్షిణాదిలో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో విజయ్ సేతుపతి ఒకడు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అతడి తత్వం అభిమానులను మరింతగా ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు ఎలాంటి వివాదాల జోలికి పోకుండా.. క్లీన్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇలాంటి హీరో తాజాగా చేసిన కొన్ని కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో విజయ్ సేతుపతిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇంతకీ వివాదం ఏమిటంటే.. శబరిమలలో మహిళలకు ప్రవేశం కల్పించడంపై కొన్ని నెలల కిందట సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుని మెజారిటీ ప్రజలు వ్యతిరేకించారు. దీంతో నిరసనలు మొదలయ్యాయి. అయితే జనాలను అభిప్రాయాలు పట్టించుకోకుండా కోర్టు తీర్పుని ఫాలో అవుతూ.. కేరళ ముఖ్యమంత్రి పినరపి విజయన్.. మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లడానికి పోలీసు భద్రత కల్పించారు.

దీంతో ప్రజల నుండి మరింత వ్యతిరేకత వచ్చింది. తాజాగా తన సినిమా షూటింగ్ కోసం కేరళకు వెళ్లిన విజయ్ సేతుపతి అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. శబరిమల విషయంలో ముఖ్యమంత్రి విజయన్ ని పొగిడాడు. తాను విజయన్ కి అభిమానిని అని చెప్పారు. దీంతో కేరళతో పాటు సొంత రాష్ట్రమైన తమిళనాడులో కూడా విజయ్ వ్యాఖ్యలపై వివాదం రేగుతోంది. 
 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు