నేను కూడా పొట్టి బట్టలు వేసుకున్నా.. కానీ.. జయసుధ కామెంట్స్!

By Udaya DFirst Published Feb 5, 2019, 4:38 PM IST
Highlights

టాలీవుడ్ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇటీవల హీరోయిన్లను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. హీరోయిన్లు కావాలని ఆడియో ఫంక్షన్స్ కి పొట్టి బట్టలు వేసుకొచ్చి నిర్మాతలను ఆకట్టుకోవాలని చూస్తుంటారని ఆయన కామెంట్స్ చేశారు. 

దీనిపై చాలామంది అసహనం వ్యక్తం చేశారు. నటుడు నాగబాబు.. ఎస్పీబీ వ్యాఖ్యలు ఖండిస్తూ ఓ వీడియో కూడా వదిలాడు. అయితే ఈ విషయంలో బాలసుబ్రహ్మణ్యంకి సపోర్ట్ చేసే వారి సంఖ్య కూడా బాగానే పెరుగుతోంది. సీనియర్ హీరోయిన్ జయసుధ.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పినదాంతో తప్పేముందని ఆయనకి మద్దతు పలికింది.

తను కూడా హీరోయిన్ గా ఉన్నప్పుడు మినీ స్కర్ట్ లు, పొట్టి దుస్తులు వేసుకున్నానని, కానీ అవన్నీ కేవలం వెండితెర వరకేనని, ఆడియో ఫంక్షన్ లకు మాత్రం పద్దతిగా వెళ్లేదాన్ని అంటూ గుర్తు చేసుకున్నారు.

ఈ కాలం అమ్మాయిలకు డిజైనర్ సోకులు ఎక్కువ అవ్వడంతో ఈవెంట్ కి ఎలా రావాలో మర్చిపోతున్నారు అంటూ జయసుధ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వీటిపై  స్పందించిన కొందరు నెటిజన్లు కాలంతో పాటు వీళ్లు మారరా అంటూ సెటైర్లు వేస్తున్నారు.  

ఆడవాళ్ల డ్రెస్సులపై నాగబాబు కామెంట్స్.. రష్మి రియాక్షన్!

హీరోయిన్ల ఎక్స్ పోజింగ్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి నాగబాబు కౌంటర్! 

click me!