తలైవన్ తలైవి ట్విట్టర్ రివ్యూ.. భారీ ఫ్లాప్ తర్వాత విజయ్ సేతుపతి కంబ్యాక్ ఇచ్చినట్లేనా

Published : Jul 25, 2025, 01:14 PM IST
తలైవన్ తలైవి ట్విట్టర్ రివ్యూ.. భారీ ఫ్లాప్ తర్వాత విజయ్ సేతుపతి కంబ్యాక్ ఇచ్చినట్లేనా

సారాంశం

ఏస్ లాంటి ఫ్లాప్ తర్వాత విజయ్ సేతుపతి నటించిన తలైవన్ తలైవి చిత్రం జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం. 

DID YOU KNOW ?
హీరోగా తెలుగులో తొలిసారి
విజయ్ సేతుపతి తొలిసారి స్ట్రైట్ గా తెలుగులో హీరోగా నటించబోతున్నారు. పూరి జగన్నాధ్ దర్శకుడు. గతంలో సైరా, ఉప్పెన చిత్రాల్లో నటించారు.

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన చిత్రం ఏస్. ఈ చిత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన రెండు నెలలోపే విజయ్ సేతుపతి మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్ సేతుపతి,, నిత్యామీనన్ జంటగా నటించిన తలైవన్ తలైవి(సర్ మేడం) చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం రిలీజ్ కాలేదు. అయితే తమిళ వెర్షన్ కి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.  

 'తలైవన్ తలైవి' జూలై 25న విడుదలై మంచి స్పందన పొందుతోంది. పాండిరాజ్ దర్శకత్వంలో సత్య జ్యోతి ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం, గ్రామీణ నేపథ్యంలో వివాహ, కుటుంబ జీవితంలోని సరదాలు, భావోద్వేగాలతో చూపిస్తుంది.

విజయ్ సేతుపతికి మంచి కంబ్యాక్?

'ఏస్' సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో, విజయ్ సేతుపతి అభిమానులు మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. 'తలైవన్ తలైవి' ఆ అంచనాలను అందుకునేలా కనిపిస్తోంది. మదురై పరోటా మాస్టర్ గా ఆయన నటన అద్భుతం. నిత్య మీనన్ కూడా భార్యగా చక్కగా నటించింది. ఇద్దరి కెమిస్ట్రీ బాగుందని ప్రేక్షకులు అంటున్నారు.

 

 

 

 

 

 

 

 

ట్రైలర్ పెరిగిన అంచనాలు.. బుకింగ్స్ హౌస్ ఫుల్

ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సుకుమార్ ఛాయాగ్రహణం, సంతోష్ నారాయణన్ సంగీతం ఆకట్టుకున్నాయి. మైనా నందిని, దీప, రోషిణి హరిప్రియన్, యోగి బాబు వంటి నటీనటులు కూడా ఉన్నారు.

బుకింగ్స్ చాలా చోట్ల హౌస్ ఫుల్ అయ్యాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్