తెలుగు లాంచింగ్: విజయ్ కు దిల్ రాజు ఎంత ఇస్తున్నాడో తెలిస్తే షాక్

By Surya Prakash  |  First Published Jun 14, 2021, 12:11 PM IST

తన కెరీర్ లోనే అతి పెద్ద ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కనుందని, దీనికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారని వంశీ చెప్పుకొచ్చారు.

 


 ‘మహర్షి’ చిత్రంతో జాతీయ పురస్కారం అందుకున్న డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి..‘మాస్టర్‌’తో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన తమిళ స్టార్‌ హీరో విజయ్ కాంబినేషన్‌లో ఓ సినిమా మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ ని సెట్ చేసింది దిల్ రాజు. త్వరలోనే ప్రారంభమయ్యే ఈ సినిమా పనులు ఇప్పటికే మొదలయ్యాయి. కథా చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో హీరో విజయ్ కు ఎంత రెమ్యునేషన్ ఇస్తున్నారనేది ఇటు టీ-టౌన్‌తో పాటు కోలీవుడ్‌లోనూ హాట్‌ టాపిక్‌ గా మారింది. 

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు విజయ్ కు వంద కోట్ల రెమ్యునేషన్ ఆఫర్ చేసారట. అందులోనూ పది కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చారని చెప్పుకుంటున్నారు. అయితే రెమ్యునేషన్ మొత్తం క్యాష్ రూపంలో కాక రైట్స్ రూపంలో కొంత ఇస్తారంటున్నారు. అయితే అవి తమిళ రైట్సా లేక డిజిటల్ రైట్సా అనేది తెలియాల్సి ఉంది. ఇక హీరోకే ఇంత ఇచ్చేస్తే ఇంక ఈ సినిమాకు బడ్జెట్ ఎంత ఉండబోతోందనేది షాక్ ఇచ్చే విషయం అవుతుంది.   

Latest Videos

 పాన్‌ ఇండియా స్థాయిలో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగుతోపాటు తమిళంలోనూ తెరకెక్కనున్న ఆ సినిమా విజయ్‌ 66వ చిత్రంగా పట్టాలెక్కుతుంది. ప్రస్తుతం విజయ్‌ తన 65వ చిత్రాన్ని నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే వంశీ పైడిపల్లితో కలిసి రంగంలోకి దిగుతారు. తమిళ హీరో కార్తి నటించిన తొలి తెలుగు సినిమా ‘ఊపిరి’ కూడా వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే తెరకెక్కడం గమనార్హం. 

తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ విజయ్‌కి మంచి స్టార్‌డమ్‌ ఉంది. తెలుగులో బలమైన మార్కెట్‌ ఏర్పడింది. ఆయన నటించిన సినిమాలు ఇటీవల మంచి వసూళ్లని సొంతం చేసుకుంటున్నాయి. మాస్టర్‌, తుపాకీ, పోలీసోడు, స్నేహితుడు, అదిరింది, సర్కారు వంటి సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇటీవల ఆయన నటించిన ‘మాస్టర్‌’ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది.  ఈ దశలో ఆయన నేరుగా తెలుగు సినిమా చేస్తుండడం కలిసొచ్చే విషయమే. ప్రస్తుతం విజయ్‌ తన 65వ చిత్రంలో బిజీగా ఉన్నారు. జార్జియాలో చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఆ చిత్రాన్ని నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు.

click me!