నిరాడంబరంగా యువ దర్శకుడి వివాహం!

Published : Jun 14, 2021, 10:58 AM ISTUpdated : Jun 14, 2021, 11:06 AM IST
నిరాడంబరంగా యువ దర్శకుడి వివాహం!

సారాంశం

హీరోయిన్స్ ప్రణీత సుభాష్, యామి గౌతమ్ ఇటీవల పెళ్లిళ్లు చేసుకున్నారు. అలాగే యువ దర్శకులు కూడా పెళ్లి బంధంలో అడుగు పెడుతున్నారు. తాజాగా కన్నడ దర్శకుడు భర్జరి చేతన్‌ మైసూరులో ఆదివారం వివాహం చేసుకున్నారు. 

పెళ్లిళ్లకు బెస్ట్ సీజన్ గా నిలుస్తుంది కరోనా కాలం. ముఖ్యంగా చిత్ర ప్రముఖులు, హీరోలు, హీరోయిన్స్ పెళ్లి చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు. లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా షూటింగ్స్, ఈవెంట్స్ అన్నీ బంధ్ కావడం జరిగింది. దీంతో సెలెబ్రెటీలకు కొంత విరామ సమయం దొరుకుతుంది. మరలా షూటింగ్స్ బిగిన్ అయ్యేలోపు దాంపత్య జీవితం హాయిగా అనుభవించ వచ్చని చాలా మంది భావిస్తున్నారు. 


హీరోయిన్స్ ప్రణీత సుభాష్, యామి గౌతమ్ ఇటీవల పెళ్లిళ్లు చేసుకున్నారు. అలాగే యువ దర్శకులు కూడా పెళ్లి బంధంలో అడుగు పెడుతున్నారు. తాజాగా కన్నడ దర్శకుడు భర్జరి చేతన్‌ మైసూరులో ఆదివారం వివాహం చేసుకున్నారు. 

అత్యంత సన్నిహితుల మధ్య సింపుల్ గా ఈ వివాహం జరిగింది. కోవిడ్ నిబంధనలు ఆంక్షల మధ్య మానస అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. నటుడు పునీత్‌ రాజ్‌కుమార్, ధృవసర్జా, నిర్మాత ఉపాపతి తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ నటిస్తున్న జేమ్స్‌ సినిమాకు చేతన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Ashu Reddy: అష్షు రెడ్డి ఎంగేజ్మెంట్ లో బిగ్ ట్విస్ట్.. తెరమీదకు బిగ్ బాస్ టైటిల్ విన్నర్, విషయం ఏంటంటే?
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు