అమితాబ్ ని బీట్ చేసిన పవన్.. రేటింగ్ లో పవర్ చూపించిన వకీల్ సాబ్!

Published : Jun 14, 2021, 11:21 AM IST
అమితాబ్ ని బీట్ చేసిన పవన్.. రేటింగ్ లో పవర్ చూపించిన వకీల్ సాబ్!

సారాంశం

ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా పవన్ వకీల్ సాబ్ రికార్డు వసూళ్లు రాబట్టింది. కాగా వకీల్ సాబ్ మూవీ మరో అరుదైన రికార్డు అందుకుంది.  ప్రముఖ సినిమా రేటింగ్ సంస్థ ఐ ఎమ్ డి బి వకీల్ సాబ్ చిత్రానికి భారీ రేటింగ్ ఇవ్వడం జరిగింది. 


వకీల్ సాబ్ మూవీతో పవన్ కళ్యాణ్ గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చారు. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తరువాత పవన్ నటించిన వకీల్ సాబ్ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎగబడిపోయారు. ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా పవన్ వకీల్ సాబ్ రికార్డు వసూళ్లు రాబట్టింది. కాగా వకీల్ సాబ్ మూవీ మరో అరుదైన రికార్డు అందుకుంది.  ప్రముఖ సినిమా రేటింగ్ సంస్థ ఐ ఎమ్ డి బి వకీల్ సాబ్ చిత్రానికి భారీ రేటింగ్ ఇవ్వడం జరిగింది. 


వకీల్ సాబ్  ఒరిజినల్ వర్షన్ పింక్ కంటే కూడా పవన్ మూవీ ఎక్కువ రేటింగ్ సాధించింది. అమితాబ్ నటించిన హిందీ మూవీ పింక్ 75.5 రేటింగ్ అందుకోగా, వకీల్ సాబ్ 84.4 రేటింగ్ దక్కించుకోవడం విశేషం. అమితాబ్ పింక్ కంటే పవన్ వకీల్ సాబ్ దాదాపు పది పాయింట్స్ అధికంగా సాధించడం గమనార్హం. రేటింగ్ లో ఒరిజినల్ వర్షన్ కి మించి రీమేక్ ఎక్కువ స్కోర్ రాబట్టడం విశేషమే అనే చెప్పాలి. 


దర్శకుడు వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ చిత్రానికి దర్శకత్వం వహించగా, దిల్ రాజు నిర్మించాడు. నివేదా థామస్, అంజలి ప్రధాన పాత్రలు చేయగా, శృతి హాసన్ పవన్ భార్యగా క్యామియో రోల్ లో కనిపించారు. ఇక థమన్ అందించిన మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. మొత్తంగా పింక్ చిత్రానికి పవన్ మార్కు కమర్షియల్ అంశాలు అద్ది తెరకెక్కించిన వకీల్ సాబ్ ఫ్యాన్స్ దాహం తీర్చింది. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?