దళపతి విజయ్‌తో వంశీపైడిపల్లి సినిమా కన్పమ్‌..ట్విట్టర్‌లో ట్రెండింగ్‌!

Published : May 30, 2021, 10:50 AM IST
దళపతి విజయ్‌తో వంశీపైడిపల్లి సినిమా కన్పమ్‌..ట్విట్టర్‌లో ట్రెండింగ్‌!

సారాంశం

ఇప్పుడు దర్శకుడు వంశీపైడిపల్లి ఓ ఇంటర్వ్యూలో దీన్ని కన్పమ్‌ చేసినట్టు ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది. విజయ్‌తోనే తన నెక్ట్స్ సినిమా ఉంటుందని చెప్పారు. 

దళపతి విజయ్‌తో `మహార్షి` దర్శకుడు వంశీపైడిపల్లి ఓ సినిమా చేయబోతున్నట్టు ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇవి గాసిప్స్ మాత్రమే అనే వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు దర్శకుడు వంశీపైడిపల్లి ఓ ఇంటర్వ్యూలో దీన్ని కన్పమ్‌ చేసినట్టు ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది. విజయ్‌తోనే తన నెక్ట్స్ సినిమా ఉంటుందని చెప్పారు. దిల్‌రాజు ఈ సినిమాని నిర్మించనున్నట్టు చెప్పారు. కరోనా వల్ల ప్రకటించడం లేదు, వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.

ఇందులో వంశీపైడిపల్లి చెబుతూ, `నా కెరీర్‌లో అతి పెద్ద ప్రాజెక్ట్ కోవిడ్‌ తగ్గిన తర్వాత ప్రారంభం కాబోతుంది. ఇందులో దళపతి విజయ్‌ నటిస్తారు. దిల్‌రాజు నిర్మాత. ప్రస్తుతం కోవిడ్‌ కారణంగా దీన్ని ప్రకటించలేదు. అన్ని పరిస్థితులు చక్కబడ్డాక అనౌన్స్ చేస్తాం. అంత వరకు మిగిలిన సమాచారమంతా సస్పెన్స్. ఇప్పటి వరకు నేను ఒకేసారి ఎక్కువ ప్రాజెక్ట్ లు చేయలేదు. చేయలేను.

 ఎందుకంటే ఒక దర్శకుడి సినీ జీవితం అతని చివరి సినిమా ఎలా ఆడిందనే విషయంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే దీని వల్ల నాకు ఓ సమస్య ఏర్పడుతుంది.  నేను కథకుడిని కాదు. అందువల్ల కథల కోసం ఇతర రైటర్స్ పై ఆధారపడాలి. ఒక ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత కథ కోసం వెతకడం మొదలు పెడితే కాలం గడిచిపోతుంది. అందువల్ల ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నా. కథ కూడా రెడీ చేసుకున్నా` అని తెలిపారు.

ఈ పోస్ట్‌లను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ దిల్‌రాజు పేరుతో ట్రెండ్‌ చేస్తున్నారు దళపతి అభిమానులు. ప్రస్తుతం విజయ్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత వంశీపైడిపల్లి సినిమా ఉండనుందని టాక్. దిల్‌రాజు ప్రస్తుతం `థ్యాంక్యూ`తోపాటు రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయబోతున్నారు. మరోవైపు వంశీపైడిపల్లి తన నెక్ట్స్ సినిమా మహేష్‌తో చేయాల్సి ఉంది. కానీ మహేష్‌ రిజెక్ట్ చేశారు. దీంతో ఇప్పుడు దళపతి వద్దకి వెళ్లినట్టు టాక్‌. మరి ఈ సినిమా బైలింగ్వల్‌గా ఉంటుందా? తమిళంలో ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి