సెల్ఫీ అడిగిన మహిళతో పుషప్‌లు చేయించిన మిలింద్‌.. చివరికి విమర్శలపాలు..

Published : May 30, 2021, 08:16 AM ISTUpdated : May 30, 2021, 08:21 AM IST
సెల్ఫీ అడిగిన మహిళతో పుషప్‌లు చేయించిన మిలింద్‌.. చివరికి విమర్శలపాలు..

సారాంశం

ఓ మహిళ చేత రోడ్డుపై పుషప్‌లు చేయించాడు మోడల్‌, బాలీవుడ్‌ నటుడు మిలింద్‌. దీంతో చివరికి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కోవల్సి వచ్చింది. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది.

తనతో ఓ సెల్ఫీ దిగాలని ఆశపడిన ఓ మహిళ చేత రోడ్డుపై పుషప్‌లు చేయించాడు మోడల్‌, బాలీవుడ్‌ నటుడు మిలింద్‌. దీంతో చివరికి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కోవల్సి వచ్చింది. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్లితే, మిలింద్‌ ఇటీవల ఓ పాత వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. ఇందులో ఆయన తనతో ఓ సెల్ఫీ దిగాలని ఉందని అడిగిన మహిళను 10 పుషప్‌లు చేయమని చెప్పడంతో ఆమె వెంటనే పుషప్‌లు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా మిలింద్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. రాయ్‌పూర్‌లోని ఓ ప్లేస్ లో సెల్ఫీ అడిగిన ఆమెను ఇలా చేయించానని చెప్పుకొచ్చాడు. తర్వాత సోమన్ ఆ మహిళతో సెల్ఫీ దిగారు.
 
అయితే ఆమె చీర ధరించి ఉంది. పైగా ఆమెని రోడ్డుపైనే అందరు చూస్తుండగానే పుషప్‌లు చేయించాడు. దీంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫిట్‌నెస్ కోసం పుషప్‌లు చేయడం ఖచ్చితంగా మంచిదే, కానీ మీరు మీతో సెల్ఫీ తీసుకోవటానికి ఇలా ఒక స్త్రీని రోడ్డు మీద పుషప్‌లు చేయించడం ఏమాత్రం బాగాలేదని, శారీరక వ్యాయామం చేయాలనే మీ ఉద్దేశం చాలా గొప్పది అయితే, ముందస్తు అనుభవం లేకుండా ఈ వయసులో పుష్-అప్స్ చేయమని అకస్మాత్తుగా చెప్పడం సరికాదంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 

ఇక మోడల్‌గా మిలింద్‌ సోమన్‌ సంచలనాలు సృష్టించారు. న్యూడ్‌గా పాముతో సెల్ఫీ దిగి అప్పట్లో పెద్ద దుమారం రేపారు. ఆమె మ్యాగజీన్ల కోసం ఇచ్చే ఫోటో షూట్‌లు చాలా సార్లు వివాదంగా, చర్చనీయాంశంగా మారుతుంటాయి. 80, 90 దశకాల్లో టాప్ మోడల్ గా రాణించిన ఆయన మధు సప్రేతో కలిసి ఎన్నో యాడ్స్‌లో నటించారు. ప్రముఖ గాయని అలీషా చినాయ్ రూపొందించిన `మేడ్ ఇన్ ఇండియా మ్యూజిక్‌`తో పాపులర్‌ అయ్యారు. 53 ఏళ్ల మిలింద్  మూడేళ్ల క్రితం తనకంటే వయసులో 26 ఏళ్లు చిన్నదైన అంకితా కోన్వార్‌ను వివాహం చేసుకుని మరోసారి వార్తల్లో నిలిచారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?