
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలంగాణ రాజకీయాలపై మరోసారి స్పందించారు. తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకు కాంగ్రెస్ పార్టీపై తిరిగి నమ్మకం కలిగిస్తోందని వర్మ అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డిని బాహుబలితో పోల్చిన వర్మ కాంగ్రెస్ కు రేవంత్ ఓట్ల వర్షం కురిపిస్తాడని అభిప్రాయ పడ్డాడు.