విజయ్ సూపర్ స్టార్ కావొచ్చు.. సూపర్ యాక్టర్ కాదు.. నటుడి కామెంట్స్!

Published : May 09, 2019, 09:48 AM IST
విజయ్ సూపర్ స్టార్ కావొచ్చు.. సూపర్ యాక్టర్ కాదు.. నటుడి కామెంట్స్!

సారాంశం

తమిళ స్టార్ హీరో విజయ్ పై మలయాళ నటుడు సిద్ధిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

తమిళ స్టార్ హీరో విజయ్ పై మలయాళ నటుడు సిద్ధిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయ్ సూపర్ స్టార్ కావచ్చేమో కానీ సూపర్ నటుడు మాత్రం కాదని ఓ మలయాళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. 

మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి గొప్ప నటులు ఉన్నందుకు మలయాళ చిత్ర పరిశ్రమ అదృష్టం చేసుకుందని, వాళ్లు తమకు ఎంతో సహాయం చేస్తున్నారని అన్నారు. ప్రతి చిత్రపరిశ్రమ.. అక్కడి సూపర్ స్టార్స్ ను బట్టి రాణిస్తుందని, మాలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు సూపర్ స్టార్స్ వల్ల జీవించగలుగుతున్నారని.. కానీ తమిళ పరిశ్రమలో పరిస్థితులు మరోలా ఉంటాయని అన్నారు.

విజయ్ సూపర్ స్టార్ అని ప్రజలు ఆయన్ని ఇష్టపడుతుంటారని.. కానీ నిజానికి ఆయన సూపర్ యాక్టర్ ఏమీ కాదని, ఆయన్ని స్టార్ డం నడిపిస్తోందని అన్నారు. తన దృష్టిలో కమల్ హాసన్ మంచి నటుడు, సూపర్ స్టార్ అని చెప్పడంతో ఇప్పుడు విషయం వివాదాస్పదంగా మారింది. 

విజయ్ అభిమానులు సిద్ధిఖీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆయన్ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?