'మహర్షి' ట్విటర్ రివ్యూ..!

By AN TeluguFirst Published May 9, 2019, 7:52 AM IST
Highlights

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'మహర్షి' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'మహర్షి' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత రాత్రి నుండే థియేటర్స్ వద్ద అభిమానులు కోలాహలంతో థియేటర్స్ అన్నీ సందడిగా మారాయి. ఇప్పటికే యూఎస్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల బెనిఫిట్ షోలు ప్రదర్శితం కావడంతో సినిమా టాక్ బయటకి వచ్చింది.

ట్విటర్ ద్వారా అభిమానులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మహర్షి సినిమా కథలో ఇన్వాల్వ్ అయ్యేలా ప్రేక్షకుడిని కట్టి పడేసిందని.. ఎమోషనల్ సాగిన క్లైమాక్స్ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లిందని.. ట్వీట్లు చేస్తున్నారు.

మహర్షి ఫస్ట్ హాఫ్ యూత్ అండ్ క్లాస్ ఆడియన్స్ కోసమని, సెకండ్ హాఫ్ మాస్ ఆడియన్స్ కోసం.. ఇది ఓవరాల్ గా ఎమోషనల్ జర్నీ అని అంటున్నారు. రైతుల గురించి మంచి సందేశం ఇచ్చారని, సినిమాలో రైతుల ఎపిసోడ్ ప్యూర్ గోల్డ్ అని కామెంట్స్ చేస్తున్నారు.

మరికొందరు మాత్రం ఇది చాలా ఫన్నీ స్టోరీ అని, సెకండ్ హాఫ్ ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదని నెగెటివ్ గా మాట్లాడుతున్నారు. మ్యూజిక్ పై కూడా విమర్శలు చేస్తున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా బ్యానర్లపై దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

 

I am completely involving in the story padara padara song superb

Godla bandi fight highlight 👌👌👌👌
With emotional climax will be remember for long time ide kadha nee katha
Hittu film 4/5

— pspk devotee (@lifeforpawan)

 

1st half: For youth and class audience
2nd half: MAss and Emotional

Overall: Full meals ,Blockbuster

— Tenali_Lakhmi_talkies (@Tenali_talkies)

 

is a decent film which picks right gear in 2nd half and goes full throttle in the end , the last 40 mins I.e., farmers episode is the heart of the film. There are many wolf whistle moments but also some inconsistent writing reduces the impact.

Thyview Rating : 6.5/10

— Thyview (@Thyview)

 

Nenu Raithu biddane ani gurtu cheshav kada anna 👍 Thank you pic.twitter.com/GH3zo2XZUa

— Goutham (@Goutham_Gangula)

 

Out side relax fans... Cinema super hit💐💐.. running length and songs little disappointing... Migatha anni crafts and actors Nilabettesaru Cinema ni... one of the best movies in career.... Enjoy this success fans 👍👍👍🤘🤘🤘

— Sriram Varma (@SriiramForU)
click me!