లీయో క్లైమాస్స్ హైదరాబాద్ లోనే.. టీమ్ తో అడుగు పెట్టబోతున్న దళపతి విజయ్.

Published : May 12, 2023, 02:02 PM IST
లీయో క్లైమాస్స్  హైదరాబాద్ లోనే.. టీమ్ తో అడుగు పెట్టబోతున్న దళపతి విజయ్.

సారాంశం

సినిమాలు సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నాడు దళపతి విజయ్. ఏమాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ చేసుకుంటూ.. లియో సినిమా ఫైనల్ షెడ్యూల్ కు తీసుకొచ్చాడు.   

సౌత్ స్టార్ విజయ్ దళపతి హీరోగా.. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సినిమా లియో. తమిళ యంగ్ స్టార్ లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈమూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా నడుస్తోంది. ఈమధ్యే స్టార్ట్ అయిన ఈమూవీ షూటింగ్.. అప్పుడే క్లైమాక్స్ కు వచ్చినట్టు తెలుస్తోంది. సెవెన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 'మాస్టర్' తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. హీరోయిన్ గా ఇక పెడ్ అవుట్ అయిపోయింది అనుకున్న త్రిష... తన అందం, టాలెంట్, ఫిట్ నెస్ తో మరోసారి కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఈసినిమాతో తానేంటో నిరూపించుకోవడం కోసం రెడీ అవుతోంది.  

అటు విజయ్,.. ఇటు లోకేష్... ఇద్దరు ఈ సినిమా షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నారు. దాదాపు షూటింగ్ క్లైమాక్స్ వరకూ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు చెన్నైలో జరుగుతోంది. విజయ్ ... అర్జున్ .. ఇతర ప్రధానమైన పాత్రల కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ షూట్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఆ షెడ్యూల్ పూర్తి అయితే.. సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచే సన్నివేశాలను హైదరాబాద్ లో షూట్ చేయడం కోసం ఇక్కడికి రాబోతున్నరట టీమ్.  తరువాత షెడ్యూల్ ను హైదరాబాద్ .. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. 

ఇక్కడ చిత్రీకరించే కీలకమైన సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయట. అంతే కాదు ఈషెడ్యూల్ తో సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అవ్వబోతున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్  కోసం ప్రత్యేమైన సెట్ కూడా వేయిస్తున్నారని అంటున్నారు. ఇది చివరి షెడ్యూల్ షూటింగు .. దీనితో షూటింగు పార్టు పూర్తికానుంది. లియో కోసం విజయ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక తమిళ సంగీత యువ సంచలనం  అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ చేస్తున్నారు. 

ఇక ఈసినిమాలో.. విజయ్, త్రిషతో పాటుగా. బాలీవుడ్ స్టార్ హీరో  సంజయ్ దత్ , గౌతమ్ మీనన్ ,మిస్కిన్ , మన్సూర్ అలీఖాన్ , ప్రియా ఆనంద్ లాంటిస్టార్స్  ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. షూటింగ్ అయిపోగానే కాస్త గ్యాప్ ఇచ్చి..నెక్ట్స్ మన్త్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ ను స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఒక వేళ లాస్ట్ షెడ్యూల్ లాంగ్ షెడ్యూల్ అయితే.. జులై నుంచి పోస్ట్ ప్రోడక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక మూవీని అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు