పూరి జగన్నాధ్ కి లైగర్ సెగ... ఫిల్మ్ ఛాంబర్ ఎదుట ఎగ్జిబిటర్స్ నిరసన!

Published : May 12, 2023, 01:05 PM ISTUpdated : May 12, 2023, 01:20 PM IST
పూరి జగన్నాధ్ కి లైగర్ సెగ... ఫిల్మ్ ఛాంబర్ ఎదుట ఎగ్జిబిటర్స్ నిరసన!

సారాంశం

లైగర్ మూవీ విడుదలై ఏడాది కావస్తుండగా దాని తాలూకు చేదు జ్ఞాపకాలు దర్శకుడు పూరిని ఇంకా వదల్లేదు. లైగర్ మూవీ కొని భారీగా నష్టపోయిన ఎగ్జిబిటర్స్ నిరసనకు దిగారు.   

2022 ఆగస్టు 25న విడుదలైన లైగర్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు పూరి జగన్నాధ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా కనీస ఆదరణ దక్కించుకోలేకపోయింది. మూవీపై భారీ హైప్ ఏర్పడిన నేపథ్యంలో అధిక ధరలకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో లైగర్ రూ. 55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. అందులో యాభై శాతం కూడా రాబట్టలేకపోయింది. దీంతో ఎగ్జిబిటర్స్, లీజర్స్ పెద్ద మొత్తంలో నష్టపోయారు. 

లైగర్ దర్శక నిర్మాతగా ఉన్న పూరి జగన్నాధ్ నష్టాలు కొంత మేర చెల్లించేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు ఎగ్జిబిటర్స్ కి ఆయన హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకోలేదని సమాచారం. దీంతో నిరసన చేస్తామని పూరి జగన్నాధ్ ని ఎగ్జిబిటర్స్ హెచ్చరించారు. దాంతో పూరి ఫైర్ అయ్యారు. తోకజాడిస్తే ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వను అంటూ పూరి బెదిరింపులకు దిగారు. అప్పట్లో పూరి జగన్నాధ్ ఎగ్జిబిటర్స్ పై సీరియస్ అవుతున్న ఆడియో ఫైల్ వైరల్ అయ్యింది.

కాగా లైగర్ ఎగ్జిబిటర్స్ ఎలాంటి ఆందోళనలు చేయలేదు. నేడు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అండ్ లీజర్స్ అసోసియేషన్ సభ్యులు నిరసనకు దిగారు. ఫిల్మ్ ఛాంబర్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. లైగర్ సినిమా బాధితులకు న్యాయం చేయాలంటూ ఫ్ల కార్డులు ప్రదరిస్తున్నారు. ఈ క్రమంలో లైగర్ చిత్ర ఎగ్జిబిటర్స్ పూరి జగన్నాధ్ నష్టాలు తిరిగి చెల్లించలేదని అర్థం అవుతుంది. 

అధిక ధరలకు సినిమా అమ్ముకున్న పూరి జగన్నాధ్ ఏ విధంగా నష్టపోలేదు. ఎగ్జిబిటర్స్ మాత్రమే నష్టపోయారనే ఓ వాదన ఉంది. లైగర్ ప్లాప్ సాకుగా చూపి హీరో విజయ్ దేవరకొండకు పూర్తి రెమ్యూనరేషన్ ఇవ్వలేదనే ప్రచారం జరిగింది. రూ. 25 కోట్లు ఆయనకు ఇవ్వాల్సి ఉండగా చిత్ర విడుదల అనంతరం మిగతా డబ్బులు తీసుకుంటానని విజయ్ దేవరకొండ అన్నారట. తర్వాత విజయ్ దేవరకొండకు పూరి, ఛార్మి డబ్బులు ఇవ్వలేదని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరిగింది. 

లైగర్ విడుదలకు ముందే విజయ్ దేవరకొండతో పూరి జగన్నాధ్ జనగణమన టైటిల్ తో మరో ప్రాజెక్ట్ ప్రకటించారు. ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపుకున్న ఈ చిత్రం మధ్యలో ఆగిపోయింది. లైగర్ ప్లాప్ నేపథ్యంలో నిర్మాతలు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. లైగర్ చిత్ర బడ్జెట్, బిజినెస్ విషయంలో పూరి, ఛార్మి, విజయ్ దేవరకొండ ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు