విజయ్ దేవరకొండ ద్వారక మార్చి 3న..

Published : Feb 10, 2017, 03:03 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
విజయ్ దేవరకొండ ద్వారక మార్చి 3న..

సారాంశం

విజయ్ దేవరకొండ సరసన పూజా ఝావేరి కథానాయికగా ద్వారక మార్చి 3న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతల సన్నాహాలు

"పెళ్లిచూపులు"తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకొన్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం "ద్వారక". విజయ్ దేవరకొండ సరసన పూజా ఝావేరి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ రవీంద్ర దర్శకుడు. "లెజెండ్ సినిమా" బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రానికి ప్రద్యుమ్న చంద్రపాటి-గణేష్ పెనుబోతు నిర్మాతలు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి సమర్పిస్తున్న ఈ చిత్రం ఆడియో విడుదలతోపాటు సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకొంది.

 

మార్చి 3న ద్వారక సినిమా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర మాట్లాడుతూ.. "క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "ద్వారక" ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. దొంగ స్వామిజీగా విజయ్ దేవరకొండ నటన, పూజా ఝావేరి గ్లామర్, వైవిధ్యమైన కథ-కథనాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణలు. విడుదలైన పాటలతోపాటు.. ట్రైలర్ కి కూడా మంచి ఆదరణ లభించింది. సినిమాకి కూడా అదే స్థాయి ఆదరణ లభిస్తుందన్న నమ్మకం ఉంది. మార్చి 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం" అన్నారు. 


పృథ్విరాజ్, ప్రభాకర్, ప్రకాష్ రాజ్, సురేఖావాని, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, నిర్మాతలు: ప్రద్యుమ్న చంద్రపాటి-గణేష్ పెనుబోతు, దర్శకత్వం: శ్రీనివాస్ రవీంద్ర!

PREV
click me!

Recommended Stories

Bigg Boss Agnipariksha: లేడీ కంటెస్టెంట్‌ షూస్‌ క్లీన్‌ చేసిన అభిజీత్‌.. దెబ్బకి పొగరు మొత్తం దిగింది
Korean Kanakaraju Day 6 Collections: కొరియన్‌ కనకరాజుకి ఊహించని వసూళ్లు.. 6వ రోజు ఎంత వచ్చాయంటే?